మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు. 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సీఎల్పీ నేత మరోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 35,190 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటివరకు 17 చోట్ల గెలువగా.. 5 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ క్రమంలో.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి దక్కుతుందని అక్కడి కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా.. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. దొరల తెలంగాణ పోయింది, ప్రజల తెలంగాణ పాలన వచ్చిందని తెలిపారు.