అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మరో విజయం సాధించింది. రామగుండంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై.. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపొందారు. 35వేలకు పైగా మెజార్టీతో కోరుకంటి చందర్ పై ఘన విజయం సాధించారు. దీంతో.. మక్కాన్ సింగ్ గెలుపుతో కాంగ్రెస్ ఖాతాలో మూడు సీట్లు చేరాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అత్యధికి స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.