పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఎర్రబెల్లిని యశస్విని ఓడించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తన గెలుపుపై యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ఎంతటి బిగ్ షాట్ లు అయినా ప్రజలు తిరస్కరిస్తే ఇంటికి వెళ్లాల్సిందేనని తెలిపారు. తన గెలుపు ప్రజల గెలుపుగా చూస్తానన్నారు. అన్ని రౌండ్స్ ల్లో తానే ఆధిక్యంలో ఉందని అన్నారు.
Pocharam Srinivas Reddy: చరిత్రను తిరిగిరాసిన పోచారం.. స్పీకర్‌గా ఉండీ కూడా విజయం..
ప్రజలకు చాలా పనులు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను… చేస్తానన్నారు. పాలకుర్తిలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే తన గెలుపు తధ్యమని అర్థమైందని యశస్విని పేర్కొ్న్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది… అందుకే మార్పు కోరుకున్నారని అన్నారు. ప్రజల్లో నేను తిరుగుతున్నప్పుడు మంచి స్పందన ఉంది… నన్ను వాళ్ళ బిడ్డలాగా చూసుకున్నారని తెలిపారు. మా కుటుంబం మొత్తం మొదటి నుంచి ప్రజల్లోనే ఉన్నాము… మేము పనులు చేస్తామనే నమ్మకంతోనే నన్ను గెలిపించడానికి సిద్ధమయ్యారని యశస్విని పేర్కొన్నారు.