పెన్షన్ల విషయంలో చత్తీస్‌గఢ్, కర్ణాటకలో రూ.200, మధ్య ప్రదేశ్ , గుజరాత్‌లో రూ.600 ఇస్తున్నారని.. దివ్యాంగులకు అండగా నిలిచి రూ.4016 ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన వారి కంటే మేము ఏ విషయంలో తక్కువ కాదు అని అన్ని సందర్భాల్లో దివ్యాంగులు నిరూపించారన్నారు. దివ్యాంగులకు చాలా మందికి వాహనాలు అందచేశామన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 29న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోమ్ ఓటింగ్ పూర్తి అయిందని.. లక్షా 68 వేల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామన్నారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
జగ్గారెడ్డిని గెలిపిస్తున్నారా లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లను అడిగారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో రాహుల్ ప్రసంగించారు. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణ కి మధ్య పోరాటం ఇది అంటూ ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల భూములు లాక్కుంటున్నారని.. వందల కోట్లు దోచుకుంటున్నారని, కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఎన్నికల ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
సీఈఓ వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ కలిసింది. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రకటనలపై ఫిర్యాదు చేసింది. మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్ పై చేసిన విమర్శల పై సీఈఓకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని బీఆర్ఎస్ లీగల్ టీం హెడ్ సోమా భరత్ పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మాదాపూర్, కూకట్ పల్లిలో వివేకానంద నగర్, హైదర్ నగర్, అల్విన్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్‌లలో ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ తో పాటు రోడ్ షోతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేరిపాటి జైపాల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చొరవతో కేశంపేట గ్రామం అన్ని వసతులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, కూతురు తేజశ్విని అన్నారు.