*సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం
మెదక్ జిల్లా తూప్రాన్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటి సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో మాట్లాడారు. దుబ్బాక, హుజురాబాద్ లో ట్రైలర్ చూశారు…ఇక సినిమా చూస్తారని ప్రధాని మోదీ తెలిపారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. నవంబర్ 26 ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. చేతకాని, అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని ప్రధాని ఆరోపించారు. ఎందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. గజ్వేల్ లో ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఓటమి భయంతో కేసీఆర్ వేరే చోటికి వెళ్లారని విమర్శించారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారని అన్నారు. ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా అని దుయ్యబట్టారు. ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి మనకి అవసరమా.. సచివాలయానికి వెళ్ళని సీఎం అవసరమా అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై రైతులు కోపంగా ఉన్నారని ప్రధాని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టి పేద రైతులను రోడ్డు మీద వదిలేశారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వి అన్ని అబద్ధపు హామీలు…ఆయన్ని దేవుడు కూడా క్షమించడని ఆరోపించారు. కేసీఆర్ దళిత సీఎం అని మోసం చేశారని తెలిపారు. దళిత బంధు అంటూ దళితులని మోసం చేశారు.. తెలంగాణ నిరుద్యోగ యువతకి సీఎం మోసం చేశారని అన్నారు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాముల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా అని మండిపడ్డారు. ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించిన కేసీఆర్ ని ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కార్బన్ కాగితాలు లాంటివని విమర్శించారు. బీజేపీతోనే తెలంగాణ గౌరవం పెరుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే..ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే రెండు వ్యాధుల నుంచి తెలంగాణని రక్షించేది బీజేపీనే ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఉమ్మడి కాంగ్రెస్ పాలనలో ఎంతమంది సీఎంలు అయ్యారు.. తెలంగాణ వచ్చాక బీసీల్లో ఎవరైనా సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీని సీఎం చేసేది బీజేపీ పార్టీనేనని తెలిపారు. సామాజిక న్యాయం కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ గుర్తించిందని తెలిపారు. ఒక కమిటీ వేసి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణాని లూటీ చేసి దేశాన్ని దోచుకోవడానికి దేశ్ కి నేత అంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న అవినీతి పార్టీతో చేయి కలిపి కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో ఎవ్వరిని వదలం, ఇది మోదీ గ్యారెంటీ అని అన్నారు.
*బీఆర్‌ఎస్, బీజేపీ ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్‌ను ఓడించడమే..
జగ్గారెడ్డిని గెలిపిస్తున్నారా లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లను అడిగారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో రాహుల్ ప్రసంగించారు. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణ కి మధ్య పోరాటం ఇది అంటూ ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల భూములు లాక్కుంటున్నారని.. వందల కోట్లు దోచుకుంటున్నారని, కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు. నేను వెళ్లి కాళేశ్వరం చూశానన్న రాహుల్ గాంధీ.. ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. లక్ష కోట్ల ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. నిన్న యువకులతో మాట్లాడానన్న రాహుల్ గాంధీ.. లక్షల రూపాయలు కోచింగ్‌లకు పెడుతున్నారని, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళ కోసం ఏం చేయలేదని, మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీకు చేశారు.. అయినా మీరు పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులు, విద్యార్థుల నుంచి ప్రభుత్వం దోచుకున్న సొమ్ము వెనక్కి ఇస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్‌లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు1200 అని.. కాంగ్రెస్ గెలవగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అన్ని మొదటి కేబినెట్‌లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు వచ్చి ఛాతీ చూపెట్టి తిరుగుతున్నారని, బీజేపీ వాళ్ళ గాలి తీసేశామన్నారు. కారు నాలుగు టైర్లలో గాలి పోయిందన్నారు. బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ నా ఎంపీ పదవి కూడా లేకుండా చేశారని.. ఇల్లు కూడా తీసుకున్నారన్నారు. తీసుకుంటే తీసుకోండి.. మీ ఇల్లు నాకు అక్కరలేదు అని చెప్పానని.. దేశంలో ప్రతి పేద ఇంట్లో నేను ఉన్నానన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్‌ని ఓడించడమేనని ఆయన చెప్పరారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్‌లో ఎంఐఎం పోటీ చేసిందన్నారు. మా ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి లాభం చేస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ అంటూ రాహుల్ తెలిపారు. ఇక్కడ మేము బీఆర్‌ఎస్‌ను ఓడించబోతున్నాం..సందేహం అక్కరలేదన్నారు. మోడీని ఢిల్లీలో ఓడించపోతున్నామన్నారు. బీజేపీ పెంచిన ద్వేషం అనే సమాజంలో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరిచామన్నారు. జగ్గారెడ్డి కష్టపడి పని చేస్తారని.. జగ్గారెడ్డిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
*కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ కి బీటీం పార్టీ..
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి బీటీం పార్టీ.. అని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా మండిపడ్డారు. మక్తల్ పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ బహిరంగ సభకు అమిత్ షా మాట్లాడుతూ.. 10 సంవత్సరాలుగా అవినీతితో కురుక పోయిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు పడకల గదిని, డిగ్రీ కళాశాల,నిరుద్యోగ యువతకు 3000 రూపాయలు వంటివి ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మట్టి దందా,ఇసుక దందాలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ నీ ముఖ్యమంత్రి నీ చేస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నీ ప్రధాన మంత్రిని చేసినట్టు అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి బీటీం పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. భీమా ప్రాజెక్ట్ పెండింగ్ లో వున్న పనులను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం 4 శాతం రద్దు చేసి OBC లకు రిజర్వేషన్ పెంచుతామన్నారు. బీద మహిళలకు 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వము ఒక్క బీజేపీ పార్టీ అని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచనదినం నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే శ్రీరాముని దర్శనం ఉచితంగా ఇస్తామన్నారు. మళ్ళీ ప్రధానిగా మోడీని చేద్దామని ప్రజలకు కోరారు.\
*బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కర్ణాటకకు రండి.. ఎవిడెన్స్ లతో సహా చూపిస్తాం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే రాష్ట్రంలో స్థిరపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలు పరుచడం లేదని అంటున్నారు. 5 హామీలను నెరవేర్చడం లేదని న్యూస్ పేపర్స్, టీవీ ఛానెల్స్ లో చూశాను. కేసీఆర్, అతని కొడుకు, బీజేపీ నేతలు మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా తొలి కేబినెట్ లోనే 5 హామీలపై సంతకం చేశామన్నారు. 5 హామీల్లో శక్తి యోజనే పథకాన్ని ముందుగా ప్రారంభించామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. రోజూ దాదాపు 61 నుంచి 62 లక్షల మంది మహిళలు రోజు ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చంటూ సవాల్ చేస్తున్నారు. తన భార్య కూడా బస్సులోనే ప్రయాణిస్తుందన్నారు.అన్న భాగ్య సిద్ధి ప్రతి ఒకరికి పది కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నాం. దీనికి 4కోట్ల 37 లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారని తెలిపారు. జులై నుంచి గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. గృహ లక్ష్మి కింద కోటి డెబ్బై లక్షల మంది రిజిస్టర్ అయ్యారని.. ఇంట్లోని మహిళా యజమానికి ప్రతి రోజు రెండు వేల రూపాయలు అందిస్తున్నామన్నారు. గృహ లక్ష్మీ కింద ఇంకా రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. యువనిధి కింద డిగ్రీ పాసైన నిరుద్యోగ యువతకు మూడు వేలు, 1500 రూపాయలు డిప్లొమా చదివిన వాళ్లకి నిరుద్యోగ భృతి ప్రకటించామన్నారు. జనవరిలో యువనిధి పథకం ప్రారంభిస్తున్నామన్నారు. మేము ప్రకటించిన ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఐదు గ్యారెంటీలతో పాటు 165 పథకాలను మేనిఫెస్టోలో పెట్టాం. 158 పథకాలను స్టార్ట్ చేసి అమలు చేస్తున్నమన్నారు. 600 పథకాలను చేస్తామని చెప్పిన బీజేపీ 10శాతం కూడా చేయలేదు. కేసీఆర్ కు అనుమానం ఉంటే కర్ణాటకకు రండి.. చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు నడుస్తున్నాయి.. మా కొత్త పథకాలు నడుస్తున్నాయి. కర్ణాటక స్టేట్ ఆర్థికంగా బలంగా ఉంది.. మా రాష్ట్ర బడ్జెట్ చాలా పెద్దదన్నారు. తెలంగాణలో వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కర్ణాటకకు రండి.. మిమ్మల్ని మా అతిథుల్లా ట్రీట్ చేసి ఎవిడెన్స్ లతో సహా చూపిస్తామన్నారు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్, బీజేపీలు పక్క దారి పట్టిస్తున్నాయన్నారు.
*ఈసారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తాం..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వదా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అందుకోసం ప్రజలందరూ ఆలోచించాలన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో మీకు మీరు ఆలోచన చేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సంపద పెంచామని…మళ్ళీ తాము గెలిస్తే 5 వేల పెన్షన్ అందిస్తామని చెప్పారు. కల్యాణ లక్ష్మీ, అమ్మఒడి వంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ.. ఇంకా పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖానాపూర్ నియోజక వర్గంలో 7300 పోడు భూమి పట్టాలు ఇస్తూ.. వారందరికీ రైతు భరోసా ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ సారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత దేశంలో మొదటి సారి రైతు బంధును పుట్టించిందే తాను అని సీఎం కేసీఆర్ అన్నారు. మరోవైపు కాంగ్రెసోళ్లు.. రైతు బంధు వద్దని అంటున్నారు… రైతు బంధు కావాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్ కావాలంటే జాన్సన్ నాయక్ ను గెలిపించండని అక్కడి జనాలను ముఖ్యమంత్రి కోరారు. అందరు మీ గ్రామాలకు వెళ్లి చర్చ పెట్టండి.. అన్ని కులంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకోండి… ఎవరు అభివృద్ధి చేశారు.. ఎవరు చేస్తారని మీరే నిర్ణయం తీసుకోండి అని అన్నారు. జాన్సన్ నాయక్ మా ఇంటి బిడ్డ లెక్క గెలిపించండి.. అభివృద్ధి చేస్తాడని సీఎం కేసీఆర్ చెప్పారు.
*కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం..!
చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే నారాయణపేట జిల్లా అయింది… ఇక్కడ కనీస మౌళిక వసతులు లేవన్నారు. పర్ణిక రక్తంలోనే త్యాగం ఉంది.. సేవా గుణం ఉందన్నారు. నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల ఆలోచన చేసి అనుమతులు తెచ్చిందే కీ.శే.చిట్టెం నర్సిరెడ్డి అని తెలిపారు. ఇక్కడి చెరువులు నిండాలని, కోస్గి, దామరగిద్ద ప్రాంతాలకు నీళ్లు రావాలని నిధులు తెచ్చింది తనే అని అన్నారు. చిట్టెం నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి చివరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. ఇక్కడి ఎమ్మెల్యే బస్టాండ్ లో తిని బజారులో పడుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను కలవాలంటే రాయచూరు వెళ్లాల్సిన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉద్దెర జీతగాడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. పర్ణికకు వేసే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లే అన్నారు. ఈ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డిని రాయచూరు పంపుదాం.. కేసీర్ ను ఫామ్ హౌస్ కు పంపుదాం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో అని తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిజ ప్రజాప్రతిందుల దుస్థితిపై లేఖలో వివరించారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసని అన్నారు. ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారని తెలిపారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయని రేవంత్ తెలిపారు. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్ లుగా చేస్తున్నారని గుర్తు చేశారు.
*గత పదేళ్ల నుండి బీఆర్ఎస్ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు..
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజక అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. డాక్టర్ రాగమయి దయానంద్ లు ప్రజా సేవ చేసిన నాయకులని తెలిపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి విచ్చలవిడిగా చేస్తుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హాయంలో ఒక్క అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పందిక్కొక్కుల్లాగ దోపిడీ చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని భట్టి మండిపడ్డారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులందరూ భారీ మెజారిటీతో గెలుపొందనున్నారు… ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యలేదని.. కేసీఆర్ కి బుద్ది ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు ఎకారానికి రూ.15000 ఇస్తాం.. బోనస్ గా 500, రైతుకూలీలకు 12000 ఇస్తామన్నారు. అంతేకాకుండా.. ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ విద్యార్ధులకు ఇస్తాం.. నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు. ఇవే కాక.. 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మేనిఫెస్ట్ ఎలా సాధ్యం అయింది అని కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. వారికి సిగ్గుండాలి.. ఈ రాష్ట్రంలో సంపద బాగా ఉంది కానీ, కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా మెక్కారు కాబట్టే అమలు చేయలేకపోయారన్నారు. ఈ ఎన్నికలు దొరలకు ప్రజల మధ్య జరిగే పోరాటం అని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలన్నది ప్రజలు ఆకాంక్ష అని పేర్కొన్నారు. అందుకోసమని సత్తుపల్లిలో రాగమయిని భారీ మెజారిటీతో గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.
*చైనాలో కొత్త వ్యాధి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో భారత్‌లో వ్యాధి తీవ్రత ఉండదని చెప్పింది. పొరుగు దేశంలో పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు. రాష్ట్రాలు, యూటీల్లో హాస్పటల్ బెడ్స్, మందులు, ఇన్‌ఫ్లూయెంజా కోసం వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, మెడికల్ పరికరాలు, టెస్టింగ్ కిట్స్, వైద్య సదుపాయాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్ల పనితీరు, ఆరోగ్య సౌకర్యాలలో ఇన్ఫెక్షన్ నియంత్రన పద్దతులపై కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. గతంలో కోవిడ్-19 అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిఘా వ్యూహాన్ని, కార్యచరణ మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ముఖ్యంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులపై దృష్టి సారించాలని చెప్పింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (IDSP), ముఖ్యంగా పిల్లలు మరియు యుక్తవయసులోని వారిపై జిల్లా, రాష్ట్ర నిఘా విభాగాల ద్వారా శ్వాసకోశ వ్యాధులను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించింది.