CEO Vikasraj: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 29న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోమ్ ఓటింగ్ పూర్తి అయిందని.. లక్షా 68 వేల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామన్నారు. 26,660 హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఎపిక్ కార్డ్స్ ప్రింటింగ్ పూర్తి అయిందని.. బీఎల్ఓ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పారు.
Also Read: CM KCR: 50 ఏండ్లు తెలంగాణను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పాలన కాదా..
2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. 2.5 లక్షల ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారని చెప్పారు. 45 వేల మంది తెలంగాణ పోలీసులు, 23,500 హోమ్ గార్స్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని వెల్లడించారు. 3వేల మంది ఎక్సైజ్ పోలీసులు, 50 వేల మంది టీఎస్‌ఎస్పీ వాళ్లు విధుల్లో ఉంటారని తెలిపారు. వీటితో పాటు కేంద్ర బలగాలు విధుల్లో ఉండనున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంటాయన్నారు. బ్రెయిలిలో కూడా బ్యాలెట్ ప్రింటింగ్ చేశామన్నారు. 190 కేంద్ర కంపెనీల బలగాలు తెలంగాణలో విధుల్లో ఉండనున్నాయన్నారు. ఇవాళ 74 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణకి రానున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో పోలింగ్‌కి 48 గంటల ముందు 144 సెక్షన్ ఉంటుందని.. ఎవరూ ప్రచారాలు, డోర్ డోర్ టు ప్రచారం చేయొద్దన్నారు. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు వెళ్లి పోవాలన్నారు. ఈసీ ఇచ్చిన నోటీసులకు కేటీఆర్‌ను వివరణ కోరామని.. ఇంకా ఎలాంటి రిప్లై రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు.