MLA Laxmareddy: జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల మండలం పోలేపల్లి, మాచారం, గంగాపుర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఆడ బిడ్డ బాగు చూసేది మన కేసీఆర్ ప్రభుత్వమే అని.. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం, రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించబోతుందన్నారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ సారి కూడా బీఆర్‌ఎస్ సర్కారు ఖాయమన్న ఆయన.. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: CM KCR: ఈసారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తాం..
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తరపున ఆయన కూతురు స్ఫూర్తి జడ్చర్ల పట్టణంలోని 13వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గడపగడపకి వెళ్లి ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. యువత భవిష్యత్తుకి భరోసా ఇచ్చేది కేవలం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆమె తెలిపారు.