Jagadeeshwar Goud: శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మాదాపూర్, కూకట్ పల్లిలో వివేకానంద నగర్, హైదర్ నగర్, అల్విన్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్‌లలో ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ తో పాటు రోడ్ షోతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేరిపాటి జైపాల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున యువకులు , కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: Jagadeeshwar Goud: నాయకులు ఇచ్చే డబ్బులకు ఓటు అమ్ముకోవద్దు..
కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని , ఇరవై ఏళ్ల తన రాజకీయ అనుభవంలో ఏ రోజు కూడా ఇతరులపైన విమర్శలు చేసి తాను ఎదగాలని అనుకోలేదని.. ఇపుడు తన పైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని పేర్కొన్నారు . ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, వారికి నేనెప్పుడు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.