Singireddy Vasanthi: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చొరవతో కేశంపేట గ్రామం అన్ని వసతులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, కూతురు తేజశ్విని అన్నారు. శనివారం రేవల్లి మండలం కేశంపేట గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి వారు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also Read: Harish Rao: ఓటుకు నోటు మరక ఉన్న రేవంత్ రెడ్డి మనకెందుకు..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రూ. కోటి 35 లక్షలతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కేశంపేట వరకు బీటీ రోడ్డు, రూ.3లక్షల 20 వేలతో అమ్మ చెరువు వాగు నుంచి హనుమాన్ దేవాలయం వరకు బీటీ నిర్మాణం, రూ 20 లక్షలతో సబ్ సెంటర్ నిర్మాణం, రూ 16 లక్షలతో జీపీ భవనం నిర్మాణం, రూ 70 వేలతో బస్ షెల్టర్ నిర్మాణం, రూ.75 లక్షల 50 వేలతో 20 సీసీ రోడ్డు పనులు, రూ 64 లక్షల 12 వేలతో మిషన్ భగీరథ పథకం కింద 359 మందికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని వారు వివరించారు. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని వారు ప్రజలను విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.