Home
Telangana Politics
Telangana Politics News
-
Kishan Reddy: కవిత ఎపిసోడ్‌పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి కీలక సూచనలు..!
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై కవిత ఆరోపణలు చేయడం ఏంటి? కవిత ఎందుకు జైలుకు పోయింది? వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి? అని ప్రశ్నించారు. ఇది డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ సమస్య అని స్పష్టం చేశారు. అది ఓ డ్రామా.. వాళ్ళ డ్రామాలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని తెలిపారు. -
Kishan Reddy: ఆ ముగ్గురూ సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు.. కిషన్‌రెడ్డి ఫైర్..!
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన… -
KCR: రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు.. కేసీఆర్ సంచనల ఆరోపణలు..!
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు. -
Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానం..
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా… -
MP Laxman: పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం?.. రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఫైర్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. -
Etala Rajender : “ఆనాడు మీరు చేసిందేంటి?”.. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు. -
CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!
2019 శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కుట్ర చేసి తనను కొడంగల్ లో ఓడిస్తే.. పద్నాలుగు రోజుల్లో ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.. ఎన్నికల్లో రక్తాన్ని చెమటగా మార్చారని.. కాబట్టే మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానన్నారు. తాజాగా బాచుపల్లిల వీఎన్ఆర్ కాలేజ్ నుంచి ప్రారంభమైన జై హింద్ ర్యాలీలో సీఎం ప్రసంగించారు.. ఖర్గే.. రాహుల్ గాంధీ.. ఆదేశాల మేరకు జై హింద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
Eatala Rajendar: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వ్యాఖ్యలపై స్పందించిన ఈటల..!
ఇవాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో కలుపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చన్నారు.. బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోందని.. కవిత కలిసి ఏం చేస్తదని విమర్శించారు. అందులో కొందరు చనిపోయారని.. కొందరు ఇంకెక్కడో ఉన్నారో తెలియదు, మరి కొందరు పార్టీలు… -
Aadi Srinivas: కవిత కామెంట్స్‌తో కేసీఆర్ అసలు రంగు బయటపడింది…
కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు. -
MLC Kavitha : మిస్టర్ కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు… విరుచుకుపడ్డ కవిత..
ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడింది. ఏది ఉన్నా తాను సూటిగానే మాట్లాడతానని స్పష్టం చేసింది. వెన్నుపోటు రాజకీయాలు చేయనని. తాను కేసీఆర్ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతానన్నారు. తిక్క తిక్కగానే ఉంటానని తెలిపారు. "పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన…
తాజావార్తలు
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!