బీసీ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీ నేతలకు ముఖ్యమంత్రి క్లాస్ పీకారు. నేను చేసేది చేసినా.. ఇక మీ ఇష్టం అని నేతలకు సూచించారు. రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి సర్వే.. కర్ర పట్టుకుని కాపాడుకుంటారో లేదో మీ ఇష్టం అని అన్నారు. సర్వే చేసినా నన్ను తిడుతున్నారు.. సర్వేలో కూడా పాల్గొనని వాళ్ళను మంచోడు అంటున్నారని తెలిపారు. సర్వేలో పాల్గొనని వాళ్ళ ఇంటి ముందు డప్పు కొట్టండి.. బలహీన వర్గాల నేతలు కులాల వారిగా సమావేశాలు పెట్టండని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీసీల కోసం సర్వే చేసిన అని తనకు గర్వంగా ఉందని తెలిపారు. తాను తల ఎత్తుకుని తిరిగే పని చేశానన్నారు.. సర్వే బలహీన వర్గాల భావోద్వేగం.. మీరు కలిసి రండి అని అన్నారు. మిగిలిన విషయాల్లో విభేదించినా ఇబ్బంది లేదు.. కానీ కుల గణన విషయంలో మాత్రం తనకు సహకరించండని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Pakistan : నేడు 22 మంది భారతీయులను విడుదల చేయనున్న పాకిస్తాన్
మార్చి 10 లోపు అన్ని సంఘాలతో మీటింగులు పెట్టి చెప్పండి.. ఈ లెక్కలు కాదు.. కూడదు అని అంటే జీవితంలో మళ్ళీ అవకాశం రాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నివేదికను అనాధ చేయకండి.. ఎవరి కులం వారు ఆ సంఘాల సమావేశం పెట్టండని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. కేసీఆర్ సర్వే ఎంత గొప్పగా ఉందో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల లెక్క చూస్తే అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమగ్ర సర్వేలో ఎస్సీలలో 82 కులాలు అని చెప్పారు.. ఎస్సీ, ఎస్టీ ఉప కులాల సంఖ్య పెరిగింది. సమగ్ర సర్వే అర్థం పర్థం లేని లెక్కలు. సిగ్గుతో బయట పెట్టలేదు. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుకు వెళ్లి బీసీ కుల గణన ఆపాలని చూస్తున్నాయి. అందుకే లెక్క సరిగ్గా.. ఆధారాలతో సహా చేశాం. కంప్యూటర్ లోనే కాదు.. సర్వే చేసిన పేపర్ బండిల్ కూడా సిద్ధంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Punjab: “ఉనికిలో లేని” శాఖకు 20 నెలలుగా మంత్రి.. ఆప్ సర్కార్‌పై బీజేపీ విమర్శలు..