Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్
- పాలమూరు అభివృద్ధిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు – హరీష్ రావు కౌంటర్
- కృష్ణా జలాల వివాదం – సీఎం రేవంత్‌పై హరీష్ తీవ్ర విమర్శలు
- కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరు పరిస్థితి – హరీష్ రావు ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు.. పిచ్చి ప్రేలాపనలు పేలిండు అని హరీష్ రావు అన్నారు. కృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నావు.. పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ లతో అనునిత్యం అంటకాగి పాలమూరుకు తీరని ద్రోహం చేసింది నువ్వు రేవంత్ రెడ్డి. పాలు తాగి రొమ్ము గుద్దిన చరిత్ర నీది. అది చరిత్ర చెపుతున్న సత్యం అని హరీష్ రావు అన్నారు. పాలమూరును దత్తత తీసుకున్న అని చెబుతూనే పడావు పెట్టిండు నీ గురువు చంద్రబాబు అని, ఆ చంద్రబాబుకు పాద సేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాచిన నీ పాపమే పాలమూరుకు శాపమైందన్నారు హరీష్ రావు. ఆనాడు తెలంగాణలో ఓట్లడిగే మొఖం చెల్లక మా పొత్తు కోసం జోలె పట్టింది నువ్వు ఇప్పటికీ నెత్తికెత్తుకునే నీ ప్రియమైన తెలుగుదేశం పార్టీ.. పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి, పాలమూరు ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్ అని హరీష్ రావు దుయ్యబట్టారు. పాలమూరు ను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్, టీడీపీ లది అయితే ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డి కి ఆ రెండు పాపాల్లో వాటా ఉందని, పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతామన్నందుకే కదా నీ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మేం బయటకు వచ్చినాము. నదీ జలాల్లో మీ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగానే ఆనాడు 40 రోజులు పాటు అసెంబ్లీనీ స్థంభింప చేసినమన్నారు హరీష్ రావు.
అంతేకాకుండా..’నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా? నీ వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా? పోతిరెడ్డి పాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చింది ,వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలనే చరిత్ర మరచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెత ను గుర్తు చేస్తోంది. చంద్రబాబు కు ఊడిగం చేసినా మోడీ కి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ లాంటి ఊసరవెల్లి కే సాధ్యం. రేవంత్ కు నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదు. తెలిసింది ఒక్క అవినీతి నోట్ల విలువ మాత్రమే.. రేవంత్ నోరుంది. కదా అని అడ్డగోలుగా మాట్లాడకు, నువ్విప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రివనే విషయం మరచిపోకు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన ఘాతకుడివి నువ్వే. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని 90% పనులు పూర్తి చేసినం. మిగిలిన 10% పనులు చేయకుండా కావాలని పండపెట్టి పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లివి నువ్వు. పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తే జనం కేసీఆర్ పేరుని తలుచుకుంటరనే కుళ్ళు బుద్ధితోని కావాలనే ప్రాజెక్టు పనులను పండబెట్టినవు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే కొడంగల్ నారాయణపేటకు కూడా నీళ్లు వస్తాయి. కేవలం మీ స్వార్థం కోసం, కమిషన్ల కోసం నారాయణపేట ఎత్తిపోతల పథకాన్నీ తెరమీదకు తెచ్చినవు. నీ దరిద్రపు కాంగ్రెస్ రాకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లము. నిన్ను ఎన్నుకున్న ఖర్మానికి పాలమూరు ప్రజలకు నీటి కటకట మొదలైంది.
Also Read
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలస బోయిన వాళ్లను వాపస్ తెచ్చింది కేసీఆర్. మీ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్.. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలే సాగైతే, ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్. జూరాలకు సంబంధించి కర్ణాటకలో ఉన్న సబ్మర్జెన్స్ కాంపెన్సేషన్ చెల్లించి పూర్తిస్థాయిలో నీటిని నింపి లక్ష ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరు అందించింది కేసీఆర్. ఆర్డీఎస్ కింద మీ దరిద్ర బోర్డు పాలనలో 30 నుంచి 35000 ఎకరాలకు మించి ఎన్నడూ సాగయ్యేది కాదు.
మేము తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేసి రాజోలి బండ పూర్తి ఆయకట్టుకు నీళ్ళు అందించినం. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినం. పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరులో నీళ్లు అందించిన ఘనత మాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాగానే మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. బీఆర్ఎస్ చేసిన కృషితోనే రాష్ట్రంలో అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన సస్యశ్యామల జిల్లాగా పాలమూరు మారుతుంది. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని అర్బకుడివి నువ్వు కేసీఆర్ మీద రంకెలేస్తావా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఉత్త వాగుడే తప్ప ఒక్క వాగు మీద కూడా ఒక్క ఇటుక పెట్టని ఒక్క చెక్ డ్యాం కూడా వదరుబోతువు నువ్వు. 14 నెలల్లో ఒక్క చెక్ డాం కూడా కట్టని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతావా ? చెల్లని రూపాయికి గీతలెక్కువ, చేతగాని రేవంత్ రెడ్డికి కోతలెక్కువ. నీ పనికిమాలిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం. నీ సవాలను స్వీకరిస్తున్న. ఏ రోజు చర్చ చేద్దాము, ఎక్కడ చర్చ చేద్దాము నువ్వే చెప్పు. నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా. నీ కొడంగల్ నియోజకవర్గమైన సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా. నీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ సంగతి, రైతుబంధు సంగతి, మహాలక్ష్మి పథకం సంగతి, పెంచవలసిన పెన్షన్ల సంగతి, నిరుద్యోగ భృతి సంగతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏల సంగతి, పెన్షనర్లకు ఇవ్వని పెన్షన్ బెనిఫిట్ ల సంగతి సకలం చర్చిస్తా.. పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా.. రేవంత్ రెడ్డి కుసంస్కారి కనుకే కేసీఆర్ పై కక్ష పూరిత ఆరోపణలు.. దవడలు పగల గొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్న .. నీ దవడనే పగలగొట్టాలి.. అరుపులు ,పెడబొబ్బలతో రాష్ట్ర సాగు తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవు రేవంత్ రెడ్డి.. నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడు.. కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావు.. అబద్దాల కోసం అజ్ఞానిలా నీ బుర్రను వాడే బదులు పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించు రేవంత్ రెడ్డి’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!