CM Revanth Reddy : బీఆర్ఎస్కు సూటిగా సవాల్ విసురుతున్నా.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊర్లనే మేం పోటీ చేస్తాం
- పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు
- ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం
- పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు
- పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదు : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : నారాయణపేట “ప్రజా పాలన- ప్రగతి బాట”బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని, పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి చేయలేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి కెసీఆర్ పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతి తెస్తే నా పై కోపంతో దాన్ని పడావు పెట్టారని, పాలమూరు వలసలు ఆపేందుకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నమేం ప్రయత్నిస్తుంటే…మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా.. పన్నెండేళ్ల మోడీ పాలనపై, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై, పన్నెండు నెలల మా పాలనపై చర్చకు మేం సిద్ధమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి.. బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ వస్తారో కొడుకును, అల్లుడిని పంపిస్తారో రండి.. ప్లేస్, డేట్ చెప్పండి చర్చకు నేను సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
అంతేకాకుండా..’కేసీఆర్ నువ్వు గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుడిని కొట్టుకో.. కాంగ్రెస్ ను కొడతామంటే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు.. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటే నిన్ను ఎవరైనా వద్దన్నారా.. పన్నెండు నెలల్లో మేం ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు.. మేం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకులకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు అప్పగించి వారిని ప్రోత్సహిస్తున్నాం.. ఆర్టీసీలో మహిళకు 600 బస్సులను అప్పగించి వారిని ఓనర్లను చేశాం.. రూ.5వేల కోట్లతో కొడంగల్, వెయ్యి కోట్లతో నారాయణపేట అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాం.. ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం.. బీఆర్ఎస్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. ఏ ఊర్లో మేం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో ఆ ఊర్లో మేం పోటీ చేస్తాం.. ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో అక్కడే మీరు పోటీచేయాలి.. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ కులగణన నిర్వహించాం.. ముప్ఫై ఏళ్లుగా పరిష్కారం కానీ ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపాం.. ఇవన్నీ కెసిఆర్ కళ్లకు కనిపించడంలేదా?.. నల్లడబ్బు పేదల ఖాతాలో వేస్తామన్న మోదీ ఏం చేశారు?.. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని వారిని మోసం చేశారు.. 2022 లోగా ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇస్తామన్నారు… ఎక్కడ ఇచ్చారో చెప్పండి..
ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలుఇస్తామన్నారు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి తప్ప తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసినా తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారు.. కాకుల్లా పొడిచే వీళ్లకు సరైన జవాబు చెప్పే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే..
పాలమూరు పచ్చగా కనబడితే వాళ్ల కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లు కండల్లో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళ కడుపులు మండుతున్నాయ్.. మీరు బాధపడొద్దు కన్నీరు పెట్టుకోవద్దు.. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకుందాం.. నష్టపరిహారం ఇచ్చి ఉద్దండాపూర్ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది.. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని బయలుదేరి మనపై కుట్రలు చేస్తున్నారు.. వారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలి.. పనులు చేసే బాధ్యత నాది… నన్ను కాపాడుకునే బాధ్యత మీది..’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Bihar: ఎగ్జామ్‌లో కాపీయింగ్ వివాదం.. కాల్పుల్లో విద్యార్థి మృతి..
తాజావార్తలు
-
Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!