ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. సీఎం ముందే వీహెచ్, అంజన్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. వీహెచ్ తన ప్రసంగంలో యాదవుల ప్రస్తావన చేయలేదని అంజన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమను తొక్కేస్తున్నారని అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరస విజయాలతో బీజేపీ దూసుకుపోతుంది.. వరసగా కాంగ్రెస్ ఓటమి చవిచూస్తుంది.. ఓటమిలో రికార్డు సృష్టిస్తుందని ఆరోపించారు.
బీసీ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీ నేతలకు ముఖ్యమంత్రి క్లాస్ పీకారు. నేను చేసేది చేసినా.. ఇక మీ ఇష్టం అని నేతలకు సూచించారు. రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి సర్వే.. కర్ర పట్టుకుని కాపాడుకుంటారో లేదో మీ ఇష్టం అని అన్నారు. సర్వే చేసినా నన్ను తిడుతున్నారు.. సర్వేలో కూడా పాల్గొనని వాళ్ళను మంచోడు అంటున్నారని తెలిపారు.
Bhatti Vikramarka : ప్రజాభవన్లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వే పకడ్బందీగా…
MLC Kavitha : నిజామాబాద్ పసుపు యార్డు ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు యార్డులో.. రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారం రోజులుగా ధరలు పడిపోయాయన్నారు. కేంద్రం 15 వేలు మద్దతు ధర ఇస్తామని గొప్పలు చెప్పి రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు కు చట్ట బద్దత లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ లో బిల్లు పెట్టీ .. బిల్లు పాస్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, పసుపు…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పడుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ (పించబడిన వర్గాల) నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ సమావేశం వల్ల పార్టీ బీసీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించడమే కాకుండా, వారిని మరింత…
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు.. పిచ్చి ప్రేలాపనలు పేలిండు అని హరీష్ రావు అన్నారు. కృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నావు.. పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ లతో…
Uttam Kumar Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బిఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట…
Madhu Yaskhi Goud : తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి అధికారుల తీరుపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వం పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించగా, అధికారంలో ఉన్న కొన్ని కీలక విభాగాల్లో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అడ్డుగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారు అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చేసిన అధికారులు ఇంకా…
CM Revanth Reddy : నారాయణపేట “ప్రజా పాలన- ప్రగతి బాట”బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని, పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి…