Kadiyam Srihari : కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం రూ.800 కోట్లు మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయానికి ప్రజల ఆదరాభిమానాలే కారణమని, ప్రతిపక్షంలో అభివృద్ధి కష్టమని గ్రహించి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, ఇంకా పెంచాలని సీఎం ప్రత్యేక నిధుల నుంచి మరిన్ని ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని, అవినీతి పాలన రాజ్యమేలిందని విమర్శించారు. పదవులు, పథకాలు అమ్ముకోవడం మాత్రమే జరిగిందని, తాగుడూ తినుడే మిగిలిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ పూర్తయ్యిందని, ఇప్పుడు టీ20 మ్యాచ్ ఆడుతున్నాడని శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆయన తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.
కడియం కావ్య మాట్లాడుతూ.. క్రిమిలేయర్‌ను తిరస్కరిస్తూ తీర్మానాన్ని పంపిన ఘనత రేవంత్‌రెడ్డిదని తెలిపారు. తెలంగాణను బూటకపు గుజరాత్ మోడల్‌తో పోల్చలేమని, తెలంగాణ మోడల్‌ను ఆయన అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయడం ఒక కీలక విజయమని తెలిపారు. వరంగల్ అంటేనే ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం ఉందని, మమునూర్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసి, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించారని చెప్పారు. గత 15 ఏళ్లలో స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి నోచుకోలేదని, అయితే కేవలం 15 నెలల్లోనే అభివృద్ధి పనులను ప్రారంభించి కడియం మార్క్ చూపించారని అన్నారు.
Rithu Chowdary : స్విమ్మింగ్ పూల్ లో రీతూ చౌదరి వయ్యారాలు..