Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Criticizes Telangana Budget 2024

Bandi Sanjay : ఓం భూం.. బుష్.. అబద్దాల్లో, అంకెల గారడీలో బీఆర్ఎస్‌ను మించింది కాంగ్రెస్

Published Date :March 19, 2025 , 5:21 pm
By Gogikar Sai Krishna
  • అబద్దాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ ను మించిన కాంగ్రెస్
  • 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు
  • కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేని బడ్జెట్ : బండి సంజయ్‌
Bandi Sanjay : ఓం భూం.. బుష్.. అబద్దాల్లో, అంకెల గారడీలో బీఆర్ఎస్‌ను మించింది కాంగ్రెస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే…డొల్ల అని తేలిపోయింది. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్ లో ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం…. అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అదికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైందని, మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే… అబద్దాలు…అంకెల గారడీ…6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు బండి సంజయ్‌. ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం… అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న హామీలను పూర్తిగా గాలికొదిలేసినట్లు ఈ బడ్జెట్ తో తేటతెల్లమైంది. మహిళలకు నెలనెలా రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గత బడ్జెట్ లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ బడ్జెట్ లోనూ ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం దుర్మార్గం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలనెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇచ్చే అంశంపై బడ్జెట్ లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదు. వ్రుద్దుల పెన్షన్ పెంపును ప్రస్తావించకుండా వారిని గాలికొదిలేసింది. నేటి బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే…కాంగ్రెస్ తిరోగమమన పాలనకు నిలువుటద్దం ఈ బడ్జెట్ అని తేలిపోయింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 420కిపైగా హమీల్లో 10 శాతం కూడా అమలయ్యే అవకాశం కన్పించడం లేదు.

Also Read

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
  • Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..

బడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదు. గత(2024-25) ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 91 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయిన దాఖలాల్లేవు. కోతలు కోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ను మించిపోయింది. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా….ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోంది. గత బడ్జెటట్ లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు.

గత ఆర్ధిక సంవత్సరంలో వైద్య రంగం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రుల్లో మందులిచ్చే పరిస్థితి లేదు. నేతన్నలను పూర్తిగా వంచించేలా బడ్జెట్ లో కోత విధించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు ఊసు లేదు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తే…. తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకపోవడం సిగ్గు చేటు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ బడ్జెట్ లో పూర్తిగా విస్మరించింది. ఉద్యోగుల డీఏలు, పెండింగ్ సమ్యలు, పీఆర్సీ ప్రస్తావనే లేదు.

కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన పార్టీ బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీ కులాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ… బడ్జెట్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేటు.

తెలంగాణలో వైద్య, విద్యా రంగాల దుస్థితి దారుణంగా ఉంది. సర్కారీ ఆసుపత్రుల్లో సూది, మందులు, కాటన్ కూడా లేక అల్లాడుతుంటే నిధులు పెంచకుండా పేద రోగులను గాలికొదిలేసింది. ఎన్నికల్లో విద్యకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ నేతలు బడ్జెట్ కేటాయింపులను చూస్తే పొంతనే లేదు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. రైతు సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు… రైతు రాబందు రాజ్యంగా మార్చేలా బడ్జెట్ కేటాయింపులు చేయడం దుర్మార్గం. 20 లక్షల మందికి పైగా రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదు. అయినప్పటికీ బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది రైతు కుటుంబాలను దారుణంగా వంచించింది. కోటి మంది రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్ధిక సాయం ఇస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం…. వాటికి కేటాయింపులు జరపకపోగా సిగ్గు లేకుండా అబద్దాలను వల్లించడం దారణం.

బడ్జెట్ తీరు తెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కన్పిస్తోంది. ఆదాయ, వ్యయాలను చూస్తుంటే అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా కాంగ్రెస్ పాలన మారింది. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58లక్షల కోట్లు అప్పు తీసుకురావడాన్ని చూస్తుంటే….. అప్పులు చేయడంలో, ఆస్తుల అమ్మడంలో, రాష్ట్రాన్ని దివాళా తీయడంలో, ప్రజలపై భారం మోపడంలో, అబద్దాలను ప్రచారం చేయడంలో, అవినీతి, దోపిడీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయినట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 6 గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులను చేసేలా సవరణలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్టెట్ కేటాయింపులకు, వాస్తవిక ఖర్చు వివరాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది బడ్జెట్ కేటాయింపులు, వాస్తవిక ఖర్చు వివరాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నాం.’ అని బండి సంజయ్‌ అన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp telangana
  • Budget Allocation
  • Congress government
  • Election Manifesto

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions