Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకులు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ దోచుకున్న డబ్బులతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్లు బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని, ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను రెండు సార్లు తిరస్కరించారని స్పష్టం చేశారు. అయినా వాళ్లకు బుద్ధి రావట్లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇది ధనిక రాష్ట్రమని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. అసలు నిజాలు బయటపడతాయని భయపడి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా వెనుకడుగేస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో బీఆర్ఎస్ శాసన సభ్యులు ఎప్పటికీ మారని దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు తాము చెప్పినదే నిజమని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనికి కారణం గత పాలకులేనని, వాళ్ల నిర్లక్ష్యమే రైతులను ఈ స్థితికి నెట్టివేసిందని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ పాలనపై ఆయన చేసిన తీవ్ర విమర్శలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
Samantha : హాస్పిటల్ బెడ్ పై సమంత ?