Komatireddy Venkat Reddy: సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం సెక్యూలర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు. మాది సెక్యూలర్ ప్రభుత్వమని, మాకు అన్ని పండుగలు సమానమేనని అన్నారు. ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ధ్యేయం అని…
CM Revanth Reddy: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత దేశానికి అపారమైన సేవలు అందించిన శివాజీ మహారాజ్ వీరత్వం, పరిపాలనా నైపుణ్యం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు,…
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. అలాగే.. ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..? అని ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉందని అన్నారు.
శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ రైతు దీక్షపై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది.. హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు.
KTR: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారని.. 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు కావచ్చినా ఇప్పటివరకు…
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమ పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో, ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్…
Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో.. ఐఏఎస్ లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని, కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారన్నారు. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోందని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపతామంటే ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళ్లమా? అని ఆయన వ్యాఖ్యానించారు.…
Duddilla Sridhar Babu : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి , రాహుల్ గాంధీ కులం , మతం గురించి ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం, వారు రాహుల్ గాంధీ తల్లి ఒక క్రిస్టియన్, తండ్రీ ఒక ముస్లిం అయినందున ఆయన కులం ఏది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బీజేపీ…