GHMC : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సుమారు 500 మంది సిబ్బంది ఎన్నికల డ్యూటీలో పాల్గొననున్నారు. వీరిలో 250 మంది పోలీసులున్నారు. భద్రతా ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈనెల 25న…
KTR : లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాన్ని, పోలీసుల ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. లగచర్ల గ్రామస్తుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందంటూ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది రాజకీయ సభలకు సాధారణంగా లభించే విరాళం కాదు, వారి ఆత్మబలమైన సంకేతం. “బీఆర్ఎస్ లాంటి పార్టీ…
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ…
Balka Suman : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే ఒక్క సంవత్సరం గడవకముందే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని శాసనసభ సభ్యులు, విపక్ష నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొకరుగా కాంగ్రెస్ పాలన తీరును ఆగ్రహంతో ఎండగడుతున్నారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యం…
Bandi Sanjay : పెద్దపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలో దారుసలామ్ మీటింగ్ పెట్టడం అన్యాయమే కాదు, పేద ముస్లింలకు గుణపాఠం చెబుతోందని మండిపడ్డారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పేద ముస్లింల పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లును పేద ముస్లింల కోసం తీసుకువచ్చినట్లు చెప్పిన సంజయ్, “బడాబాబులు, బడా చోర్లు కలిసి హైదరాబాద్‌లో…
Bandi Sanjay : జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్ ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని అన్నారు. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్…
Aadi Srinivas : గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి త్యాగాలు చేసిన కుటుంబాన్ని “డూప్లికేట్ గాంధీ కుటుంబం” అంటూ మాట్లాడడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ జైలు పాలయ్యారు, తన ఆస్తులన్నీ దేశం కోసం ధారపోశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. సోనియా…
KK Mahender Reddy : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అబద్ధపు ప్రచారాలతో అని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని అని ఆరోపించారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి, జ్యూస్ తాగిన వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోలేరు అని ఆయన…
TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని, పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు, మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని ఆయన మండిపడ్డారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందని…