MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై, తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న కుట్రలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్న కొందరు కోవర్టులు నన్ను ఓడించేందుకు ప్రయత్నించారని, పేయిడ్ న్యూస్‌లు వేసి, లేఖల్ని లీక్ చేసి, బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ను కలిపే కుట్రలు చేస్తున్నారు అని విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలంటే ట్వీట్లు చేయడం మాత్రమే కాదు, కార్యాచరణ చూపించాలి. పార్టీ నడిపించే సత్తా మీకు లేదని నన్ను తప్పుబడుతున్నవారు ముందుగా వాళ్లు ఏం చేశారో చెప్పాలి,” అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
Pawan Kalyan OG: మరోసారి OG సినిమా పోస్ట్‌పోన్ తప్పదా..? అసలు విషయం ఏంటంటే..!
తమపై కుట్రలు జరుగుతున్నాయని, తనను బీఆర్‌ఎస్ నుంచి బయటకు నెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. “నేను జైలులో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలని ప్రస్తావించారు. కానీ నేను నిరాకరించా. ఇప్పుడు నన్ను కేసీఆర్‌కు దూరం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి,” అన్నారు.
“నాకు ఒక్క నాయకుడు మాత్రమే ఉన్నాడు – ఆయన కేసీఆర్. కొత్త పార్టీలు ఎందుకు? ఉన్న బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను కాపాడితే చాలు. తెలంగాణ జాగృతి ద్వారా నేను పార్టీకి, రాష్ట్రానికి సేవ చేస్తున్నా,” అని స్పష్టం చేశారు. “నేను పదవులు అడిగినవాళ్లలోని కాదు. కేసీఆర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో పని చేస్తున్నా. నా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు కూడా తెలంగాణ కోసం పోరాడిన నేను.. మామూలు నాయకురాలు కాదు. నాతో పెట్టుకుంటే తీపిగా ఉండదని ఇప్పటికైనా గ్రహించాలి,” అంటూ కవిత మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
PBKS vs RCB: పంజాబ్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్.. కలవరపెడుతున్న కోహ్లీ గణాంకాలు!