ఇవాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీలో కలుపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చన్నారు.. బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోందని.. కవిత కలిసి ఏం చేస్తదని విమర్శించారు. అందులో కొందరు చనిపోయారని.. కొందరు ఇంకెక్కడో ఉన్నారో తెలియదు, మరి కొందరు పార్టీలు మారారని చెప్పారు.
READ MORE: Sai Durga Tej : నీ త్యాగాలు నాకు తెలుసు బాబాయ్.. మనోజ్ పై సాయిదుర్గా తేజ్ పోస్ట్
బీజేపీ ప్రజాస్వామిక పార్టీ, స్ట్రైట్ ఫైట్ తప్పా స్ట్రీట్ ఫైట్ ఉండదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలతో కూడిన రాజకీయం చేయదని వెల్లడించారు. రాష్ట్రాన్ని పదేళ్లలో కేసీఆర్ ముంచితే.. పది నెలలోనే రేవంత్ ముంచాడని ఎద్దేవా చేశారు. వీళ్లకు మరోసారి ఓటు వేయద్దొని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. పక్క రాష్ట్రం కేంద్ర సహకారంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని.. ఇక్కడ మాత్రం అప్పులతో ఇబ్బంది పడే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ వస్తేనే సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత విలీనం కామెంట్లపై ఈటల రాజేందర్ స్పందించారు.. గాలి వార్తలకు నేను ఏం సమాధానం చెప్పాలి.. తెలిస్తే చెబుతా కానీ, తెలియకుండా ఏం చెప్పాలి.. నేను జిమేదార్ ఉన్న రాజకీయ నాయకుడిని.. వాస్తవం ఉంటే మాట్లాడతా, లేకుండా మాట్లాడనని స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా వెళ్తానని, గతంలో మంత్రిగా బాధ్యతగల వ్యక్తిగా విచారణకు వెళ్తానన్నారు. న్యాయం, చట్టాన్ని గౌరవించే పార్టీ బీజేపీ అని పునరుద్ఘాటించారు.
READ MORE: Mamata Banerjee: ప్రధాని మోడీ విమర్శలపై మమత సవాల్.. టీవీ డిబేట్‌కు రావాలని పిలుపు