CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ప్రపంచ పటంలోనే పాకిస్థాన్ కనపడ వద్దు.. తుడిచి పెట్టు అని మోడీకి చెప్పినం
- దేశ భద్రత విషయంలో రాజకీయాలు సరికావని రాహుల్ గాంధీ చెప్పారు
- పాకిస్థాన్ పై చర్యల విషయంలో రాహుల్ గాంధీ.. ఖర్గే మద్దతు తెలిపారు
- నాలుగు రోజుల దాడుల తరువాత ఎవరు ఎవరికి లోగిపోయారు తెలీదు
- జైహింద్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019 శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కుట్ర చేసి తనను కొడంగల్ లో ఓడిస్తే.. పద్నాలుగు రోజుల్లో ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.. ఎన్నికల్లో రక్తాన్ని చెమటగా మార్చారని.. కాబట్టే మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానన్నారు. తాజాగా బాచుపల్లిల వీఎన్ఆర్ కాలేజ్ నుంచి ప్రారంభమైన జై హింద్ ర్యాలీలో సీఎం ప్రసంగించారు.. ఖర్గే.. రాహుల్ గాంధీ.. ఆదేశాల మేరకు జై హింద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం.. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పాకిస్థాన్ ను ఓడించేవారని చెప్పారు. ప్రపంచ పటంలోనే పాకిస్థాన్ కనపడద్దని.. తుడిచి పెట్టు అని మోడీకి చెప్పినట్లు వెల్లడించారు.. దేశ భద్రత విషయంలో రాజకీయాలు సరికావని రాహుల్ గాంధీ చెప్పారన్నారు.. పాకిస్థాన్ పై చర్యల విషయంలో అఖిలపక్షం పిలిస్తే.. రాహుల్ గాంధీ.. ఖర్గే దానికి సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. నాలుగు రోజుల దాడుల తరువాత ఎవరు ఎవరికి లోగిపోయారు తెలీదన్నారు..
READ MORE: Gadikota Srikanth Reddy: మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడటం లేదు..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రంప్ మధ్యలో వచ్చి యుద్ధం ఆపిన అంటూ చెప్పారని.. కాల్పులు ఆపినప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు..నాకయత్వం అంటే ఆషామాషీ కాదని.. యుద్ధం అంటే ధైర్యం ఉండాలన్నారు. నాటి ప్రధాని ఇందిరమ్మను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారన్నారు. నాడు ఇందిరాగాంధీ చైనాను సరిహద్దుల వరకు తరిమి కొట్టి.. బాగా బుద్ధి చెప్పారన్నారు. పాకిస్థాన్ ఇండియా యుద్ధం చేస్తుంటే అమెరికా మనల్ని భయపడితే.. వాళ్ళని ఎదిరించారని తెలిపారు. పాకిస్థాన్ కు అమెరికా సపోర్ట్ చేస్తా అంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు యుద్ధానికి రానీ సంగతి తెలుస్తా అని ఇందిరాగాంధీ చెప్పారని.. పాకిస్థాన్‌ను ఎలా ఓడించాలి అనే ఆలోచన లేకపోతే ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి సూచించామన్నారు.
READ MORE: Mangaluru Murder: సంచలనంగా మంగళూర్ హత్య.. కాంగ్రెస్‌కి ముస్లిం కార్యకర్తల సామూహిక రాజీనామా..
“మొట్టమొదటగా తిరంగా ర్యాలీ తీసి సైనికులకు కేంద్రానికి అండగా ఉన్నాం..పాకిస్థానోడు మన వాళ్ళని చంపితే బీజేపీ నాయకులు గాడిద పళ్లు తోముతున్నారా.? రాష్ట్రాలను తిరుగుకుంటూ రాహుల్ గాంధీని తిడుతున్నారు మోడీ.. ఎందుకు తిడుతున్నాడో ఆయనకు అయిన తెలుసా.! చైనా పాకిస్థాన్ లను బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీని మోడీ విమర్శిస్తున్నారు. అసలు బీజేపీ తిరంగ ర్యాలీని ఎందుకు తీస్తుంది. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం ఎంత వరకు కరెక్ట్? గొప్పల కోసమే తప్పా పాకిస్థాన్ తో యుద్ధం చేసే పని.. శక్తి బీజేపీ వాళ్ళకి లేదు.. ట్రంప్ కు మోడీ భయపడ్డాడు కాబట్టే యుద్ధం ఆపారు. పాకిస్థాన్ తో జరిగిన దాడుల్లో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పండి.? ఎందుకు రాఫెల్ యుద్ధం విమానాలు కూలిపోయాయో చెప్పమంటే.. ఎందుకు చెప్పడం లేదు. జై హిందూ యాత్ర రాజకీయాల కోసం కాదు.. పార్టీ కోసం కాదు.. దేశం కోసం.. ఓ తలకుమాసినోడు కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు.. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇళ్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ ఒక్కరే.. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం.. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పాకిస్థాన్ ను ఓడించేవాడు.. అపరకాళీ ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయడమే మన లక్ష్యం..” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!