Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం…
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలన్నారు. మీడియాతో మాట్లాడిన అద్దంకి.. బీఆర్ఎస్, కేటీఆర్ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అన్నారు. దమ్ముంటే తమ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.
Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అబ్జర్వర్లను నియమించింది. బుధవారం గాంధీ భవన్లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 35 జిల్లాలకు ఇద్దరు చొప్పున మొత్తం 70 మంది నేతలను అబ్జర్వర్లుగా నియమించారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు మహిళా నేతలకు కూడా అవకాశాన్ని కల్పించారు. ఈ నియామకంపై సమావేశంలో టీఎస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా చర్చించారు. మహిళా నేతలకు మరిన్ని అవకాశాలు…
Aadi Srinivas : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయనను స్టేట్మెంట్ కోసం ఈరోజు విచారణకు పిలిపించారు. సీఐడీ డీఎస్పీ ఆయన స్టేట్మెంట్ను పూర్తిగా రికార్డ్ చేశారు. ఆది శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను ఉపయోగించి పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఈ అంశంపై గత 15 ఏళ్లుగా పోరాటం సాగించిన శ్రీనివాస్, ఇటీవల హైకోర్టు ఇచ్చిన…
CM Revanth Reddy : గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పై చేసిన వ్యాఖ్యలపై, ఆయన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో, బీజేపీ అధికారం చేపట్టినప్పుడు రిజర్వేషన్లను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా, పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు ఆడియో, వీడియో క్లిప్స్ సమర్పించారు. Sri Chaitanya : తెలంగాణ ఇంటర్మీడియేట్…
Marri Rajashekar Reddy : మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల వద్ద విజ్ఞప్తులు…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
Jeevan Reddy : జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” సభలో రాజకీయ వేడి పెరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మడిగే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ముసుగులో వచ్చిన వాళ్ల కంటే మనం గట్టిగానే ఉన్నాం.…