Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రానికి తగినదే కాకుండా, నష్టం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షం తన పాత్రను వదిలి, శత్రుదేశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన సమయంలో బీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బీజేపీతో ఢిల్లీలో మైత్రీ, రాష్ట్రంలో పట్టు పోట్లుతో ఉన్నట్టు బిహేవ్ చేస్తోందని విమర్శించారు. “తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేసారు?” అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. ప్రజలకు నష్టమే కలిగించినందుకు ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయన్న మంత్రి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు పూర్తిగా ఖండిస్తారని వ్యాఖ్యానించారు.
EX MLA Pedda Reddy: పోలీసులను అడ్డం పెట్టుకొని జేసీ రాజకీయాలు చేస్తున్నాడు..
బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నెల రోజుల్లో పడేస్తామంటూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంటే, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పాలన రాష్ట్రాన్ని అప్పులలో ముంచిందని, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా, తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో తగ్గట్లేదని స్పష్టం చేశారు.
ఇక జులై 4న జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచీ భారీగా జన సమీకరణ చేయాలని సూచించారు. పార్టీలో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు అందేలా త్వరలోనే దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు సహా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం.. పార్టీ సమన్వయంతో సంక్షేమ పథకాలను ప్రజల వరకు తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా, గాంధీభవన్‌లో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు.
EX MLA Pedda Reddy: పోలీసులను అడ్డం పెట్టుకొని జేసీ రాజకీయాలు చేస్తున్నాడు..