ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అధ్యక్షుడు పదవి అడుగుతానని.. కానీ ఇస్తరా లేదా వాళ్ళ ఇష్టమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 1995 నుంచి హిందూ వాహినిలో కార్యకర్తగా పని చేసినట్లు చెప్పారు. నేను 1995 నుండి 2009 వరకు హిందూ వాహినిలో ఫిజికల్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించానని వెల్లడించారు. 2009లో మంగళాటి డివిజన్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ అడిగితే బీజేపీ ఇవ్వలేదన్నారు. అందుకే టీడీపీ నుంచి టికెట్ తీసుకొని ఆ సమయంలో కొట్లాడి గెలిచానని స్పష్టం చేశారు.
READ MORE: Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ఎవరైనా వెళ్లే ఛాన్స్.. ఇలా చేయండి చాలు..
భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014లో తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినట్లు గుర్తు చేశారు. ధర్మం కోసం కొట్లాడి 1998, 2010, 2012లో ఎన్నో సార్లు జైలుకి వెళ్ళినానన్నారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా 77 రోజులు జైలు జీవితం గడిపానన్నారు. హిందూ దేశం, ధర్మరక్షణ, గౌరక్షణ ఇదే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. తనకు అధ్యక్ష పదవి ఇయ్యరని తెలిసినా ప్రయత్నం చేస్తే తప్పేముందన్నారు. నామినేషన్ డేటు డిక్లేర్ అయిన తర్వాత దీనికి సంబంధించి తాను కూడా నామినేషన్ ఎయ్యాలా? వద్దా? అని ఆలోచిస్తానని వెల్లడించారు.