జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్‌కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి ఫకీర్ సురేష్‌ను కత్తితో మెడ కోసి హత్య చేశాడు.
Firing on Telangana Police in Bihar: బీహార్ లో తెలంగాన పోలీసులపై సైబర్ నేరగాళ్లు కాల్పులు ఘటన కలకలం రేపింది. బీహార్, కోల్‌కత్తాలో వాహనాల డీలర్ షిప్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు బీహార్ కు వెళ్లిన తెలంగాణ పోలీసులు. భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. అయితే పోలీసులు, నిందితుల…
Cyber Congress: రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు 10 నెలల పాటు నిర్వహించిన సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ నిన్న గురువారం ముగిసింది. ఇందులో భాగంగా సైబర్ సేఫ్టీపై
ప్రధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. మోడీ రాకకు ముందుగా నిన్న (బుధవార)మే హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందాలు నోవాటెల్ హోటల్లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న సందర్భంగా.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు.…
ల్యాండ్ మాపియాకు పోలీసులు చెక్ పెట్టనున్నారు. భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయకులను సతాయించే ల్యాండ్ మాఫియాలకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వారి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీపీ ఈవోడబ్ల్యూ విభాగానికి కొంతమంది నిపుణులను జోడించారు. దర్యాప్తు అధికారులతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని ల్యాండ్ మాఫియా…
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన నిరసనల సందర్భంగా రైల్వే పోలీసు అధికారులు 8ఏళ్ల క్రితం నాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే ధరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సుమారు 2,000 మంది ఆర్మీ ఆశావహులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి, కోచ్‌లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసు అధికారులు రాళ్ల దాడులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కూడా రాష్ట్ర పోలీసులు ‘ఏపీ పోలీస్’ అని రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇప్పటికే బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు,పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్ లైంగిక…