అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం…
మావోయిస్ట్ పార్టీ ప్రముఖ నేత ఆర్కే భార్య శిరీష తెలంగాణ పోలీసులపై విమర్శలు చేశారు. ఆర్కేపై వచ్చిన కథనాలను, ఇంటర్వ్యూలను సేకరించి తాను బుక్ తయారుచేసి హైదరాబాద్లో ఆవిష్కరించాలని భావించానని…మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే పుస్తకంలో ప్రస్తావించానని, కానీ ఆ పుస్తకావిష్కరణను పోలీసులు అడ్డుకున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో ఎటువంటి విప్లవ సాహిత్యం లేదన్నారు. పుస్తక ఆవిష్కరణ కోసం డీజీపీ దగ్గర అర్జీ పెట్టుకున్నానని, ఆ తరువాత రోజే పుస్తకం ప్రింట్ చేస్తున్న…
రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యువ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్లో 30 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టారు. ఈ కేసులో నిందితులకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్ లను కొట్టివేసింది. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా సుమన్ గత కొన్నేళ్లుగా ప్రైవేట్ క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్లలో…
శ్రీశైలండ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైల డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 14,314 క్యూసెకులు ఉండగా…
ఏపీకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు టీఎస్ పోలీసులు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తున్నారు టీఎస్ పోలీసులు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్తున్న అంబులెన్స్ లను నిలిపివేస్తున్నారు టీఎస్ పోలీసులు. ఇందులో భాగంగానే జగ్గయ్యపేట బోర్డర్ దగ్గర…