TSPSC Paper Leak: TSPSC పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leak: TSPSC: ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు కానీ.. ఇక్కడ ఇంటి దొంగ గుట్టును రట్టు చేశారు అధికారులు. టీఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. అమ్మాయి కోసమే టీఎస్పీఎస్సీ సెక్రెటరీ పీ ఏ ప్రవీణ్ ప్రశ్నా పత్రం లీక్ చేశారని, అది కూడా ఒక అమ్మాయికోసమని తెలియడంతో అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే ప్రవీణ్ ను అధికారులు అదుపులో తీసుకున్నారు. ఒక అమ్మాయికోసం ప్రవీన్ చేసిన పనికి పరీక్షలే వాయిదా పడే పరిస్థితి రావడంతో రాష్ట్రంలో చర్చకు దారితీసింది.
ఏం జరిగింది..
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
అధికారులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ఇటీవల తరచుగా ఓ అమ్మాయి రావడాన్ని గమనించారు. ఆమె తరుచూ వచ్చేది ప్రవీణ్ కోసమే అని గుర్తించారు. ఆయువతి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈనేపథ్యంలో తనకు ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలని కోరింది. తను కోరిన వెంటనే తను ఏమీ ఆలోచించకుండా ఆమె కోసమే ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. ఆ..యువతి కోసమే టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ జరిగిందని అధికారులు గుర్తించారు. ఆ.. యువతి తమ్ముడు పరీక్ష రాస్తుండటంతో ప్రవీణ్ ను ప్రశ్నా పత్రం అడిగిందని కాన్ఫిడెన్సియల్ సిస్టం క్రెడెన్సియల్స్ సెక్రెటరీ పీ ఏ ప్రవీణ్ వెల్లడించాడు. దీంతో.. అడ్మినిస్ట్రేటివ్ సిస్టం పై పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు ఇచ్చి అతని సిస్టం లో లాగిన్ అయ్యారని, ఆ సిస్టం లో ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేయకుండా నేరుగా ప్రవీణ్ మొబైల్ కు పంపుకున్నారు. దాన్ని ప్రవీణ్ ఆ అమ్మాయికి నేరుగా వాట్సప్‌కు పంపాడు.
ఇక్కడే ట్వీస్ట్ వచ్చింది. అమ్మాయి తమ్ముడి నీ పరీక్షకు ప్రిపేర్ చేశాక తమ్ముడి స్నేహితులకు తెలిసి డబ్బులకు పేపర్ ను అడిగారు. అప్పుడు మొత్తం 14 లక్షలు మాట్లాడుకుని …4 లక్షలు ఆమె వుంచుకుని…10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చేలా …డీల్ కుదుర్చుకున్నారు… ఆ డీల్ లో డబ్బులు ఇచ్చే దగ్గరే తేడాలు వచ్చి… ఒక యువకుడు డయల్ 100 కు కాల్ చేసి …పేపర్ లీక్ విషయం చెప్పాడు. నిందితుల్లో మహిళ భర్త కూడా వున్నాడని అధికారులు గుర్తించారు. గతం లో జరిగిన పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయ అని టీఎస్ పీ ఎస్సీ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం ఒక అమ్మాయి కోసం ఓ అధికారి అయి వుండి ఇలా చేయడం సిగ్గుచేటని, ఇప్పటి వరకు మేము ప్రిపరేషన్ అయిన వారు ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి పని పాల్పడిన ఆ అమ్మాని,తన తమ్ముడు, వారి స్నేహితులను పరీక్ష రాయకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈరోజు (మార్చి 12న) నిర్వహించాల్సిన టీపీబీఓ (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్) రాత పరీక్ష, 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ శనివారం (మార్చి 11) రాత్రి ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. హ్యాకింగ్‌పై TSPSC పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తే ఉద్దేశపూర్వకంగా లీక్ చేసినట్లు తేలింది. పేపర్ లీక్ వెనుక టీఎస్ పీఎస్సీ ఉద్యోగి హస్తం ఉన్నట్లు తేలింది.
Phalguna Masam: ఫాల్గుణ సోమవారం నాడు ఈ స్తోత్రం వింటే గ్రహ బాధల నుండి ఉపశమనం
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!