ప్రధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. మోడీ రాకకు ముందుగా నిన్న (బుధవార)మే హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందాలు నోవాటెల్ హోటల్లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న సందర్భంగా.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు.…
ల్యాండ్ మాపియాకు పోలీసులు చెక్ పెట్టనున్నారు. భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయకులను సతాయించే ల్యాండ్ మాఫియాలకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వారి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీపీ ఈవోడబ్ల్యూ విభాగానికి కొంతమంది నిపుణులను జోడించారు. దర్యాప్తు అధికారులతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని ల్యాండ్ మాఫియా…
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన నిరసనల సందర్భంగా రైల్వే పోలీసు అధికారులు 8ఏళ్ల క్రితం నాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే ధరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సుమారు 2,000 మంది ఆర్మీ ఆశావహులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి, కోచ్‌లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసు అధికారులు రాళ్ల దాడులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కూడా రాష్ట్ర పోలీసులు ‘ఏపీ పోలీస్’ అని రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇప్పటికే బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు,పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్ లైంగిక…
కరీంనగర్ జిల్లాలో మందుబాబులు హల్ చల్ సృష్టించారు. ద్విచక్ర వాహనం పై వెలుతున్న మహిళను అడ్డంగించడమే కాకుండా.. ఆమె పై దుర్భాషలాడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మందుబాబుల భరతం పట్టారు. ఇక వివరాల్లోకి వెళితే.. షీటీం మహిళా కానిస్టేబుల్ హైదరాబాద్ నుండి మంచిర్యాల వెళ్తుతోంది. దీంతో అక్కడున్న మద్యం మత్తులో వున్న ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించారు. ఆమె షీ టీం కానిస్టేబుల్ అని చెబుతున్నా వినకుండా ఆ మాటలు పక్కన పెట్టి, ఆమె…
గచ్చిబౌలి లో మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న జమ్మూ కాశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్లాట్ లో ఇద్దరి రూమ్ మేట్స్ తో కలిసివుంటున్న ఆమె. రూప్ ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఒక స్నేహితురాలు ఢిల్లీ వెల్లగా మరో స్నేహితురాలు ఆఫీస్ వెల్లడంతో.. ప్లాట్ లో ఒంటరిగా వుంటున్న కృతి ఆత్మహత్యకు చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకునే…
ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్ పై కరాటే కళ్యాణి దాడి చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఆవీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ కావడంతో.. ఓరేంజ్ లో చర్చకు దారితీసింది. కరాటే కళ్యాణి శ్రీకాంత్ పై శ్రీకాంత్ కరాటే కళ్యాణిపై ఒకరి పై మరొకరు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టారు అధికారులు. కరాటే కళ్యాణి దగ్గర వున్న దత్తత తీసుకున్న పాపపై కేసు మలుపుతిరిగింది. ఎలా దత్తత తీసుకున్నారు అంటూ ఇంటి వరకు విచారణకు…
తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైందా? తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారా? గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా పోలీసులు ఎందుకు అప్రమత్తం అయ్యారు? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాపకింద నీరులా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని, మావోయిస్టుల చర్యలను తింపికొట్టేందుకు ముందస్తుగా పోలీసులు గోదావరి పరివాహక ప్రాంతాలలో కూంబీంగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో మహదేవపూర్,పలిమెల,మహాముత్తారం,మల్హార్ ,కాటారం మండలాలలో పోలీసులు నిత్యం…
తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అసభ్యకర పదజాలంతో దూషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఆడియో అంశంపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి స్పందించారు. తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి జాతర కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని.. ఈ విషయంలోనే తాను సీఐతో మాట్లాడానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కానీ వైరల్ అవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. తాను సీఐని దూషించలేదని…