తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. చత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్లో ‘టీ-సేఫ్ – మహిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క విశిష్టతను వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2022 ప్రకారం,…
New Year 2026 Permissions: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ 2026 వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సిందిగా పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ నైట్ వేడుకలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఈ అనుమతుల కోసం డిసెంబర్ 21, 2025 వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమతి కోసం…
Operation Karregutta : ములుగు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వాజేడు మండలం మొరుమూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుండి కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ భూమిపూజ చేయడంతో, ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లైంది. మొరుమూరు గ్రామం నుంచి పామునూర్, జెల్లా, డోలి, తడపాల, చెలిమల గ్రామాల మీదుగా కర్రెగుట్టల…
Shamirpet Police Station : దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో…
Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి…
I Bomma Ravi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఐదు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఐ బొమ్మ రవిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రవి పర్సనల్ విషయాలతో పాటు, అసలు హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు అనేది తెలిసింది. అలాగే పైరసీ ఎలా చేసేవాడు, ఎలాంటి నెట్…
I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ మీద ఐ బొమ్మ రవి ఎలాంటి నోరు విప్పట్లేదని తెలుస్తోంది. మనకు తెలిసిందే కదా ఐ బొమ్మ రవిని పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు కస్టడీలో భాగంగా వెబ్ సైట్ సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆరా తీశారు. ఇక రెండో రోజు కస్టడీలో బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. పైరసీ నుంచి వచ్చిన డబ్బును ఎవరికి పంపించాడు, బెట్టింగ్ యాప్స్…
Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ పై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.
CP Sajjanar: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ చేశారు. రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు చెప్పిన అడ్రస్సులో ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు.
Arrive Alive : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమంద్వారా, ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను పోలీస్ శాఖ పత్రిక ప్రకటన ద్వారా విడుదల చేసింది. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు, ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు,…