Fake Certificates: గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన పలువురు అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (AEO) అధికారుల గుట్టు బయటపడింది. వీరు ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించినట్లు దొంగ డిగ్రీలు సృష్టించుకుని ఉద్యోగాల్లో చేరినట్లు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై అధికారికంగా విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఏడుగురు ఉద్యోగుల నకిలీ డిగ్రీలపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి…
ACB Calls: ఏసీబీ పేరుతో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ డీజీ అధికారికంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించకుంటే కేసు పెడతామని భయపెట్టే వారి మాటలను నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే సంబంధిత అధికారులకు…
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబికుల మధ్య ఆర్థిక వివాదం ప్రాణహానికి దారితీసింది. ఇటీవలే జేసీబీ కొనుగోలు చేసారు గోపాల్, అతని బామ్మర్ది సురేష్. అయితే గోపాల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం బామ్మర్ది సురేష్ ను హత్య చేశాడు. జేసీబీ పూర్తిగా తన సొంతమవుతుందని భావించిన సురేష్, కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తన బావ గోపాల్‌ను నమ్మించి, మద్యం తాగుదామని పిలిచాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కూడా…
హిమాయత్ నగర్ దోపిడీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోపిడీ జరిగిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తమయ్యి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.. మూడు కోట్ల రూపాయల సొత్తు దొంగిలించారని.. సొత్తు విలువ బహిరంగ మార్కెట్ విలువ అయిదు కోట్లు పైనే ఉంటుందన్నారు..
Duplicate MRO: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్చల్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు నకిలీ ఉద్యోగిగా సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నకిలీ తహసీల్దార్‌ను సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కోమ్పల్లి ప్రాంతానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తాను తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ ఐడీతో సచివాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్ స్టిక్కర్‌తో వాహనంలో వచ్చిన అతడిపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆపై సైఫాబాద్…
Telangana Secretariat : సెక్రటేరియట్ వద్ద ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు దిగాడు సదర్ వ్యక్తి. అయితే.. మూడు రోజుల నుంచి లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అధికారులకు ఫోన్ చేస్తున్నాడు. దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపులు దిగాడు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించారు ఎస్పీఎఫ్…
Blackmailer: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు అదే టెక్నాలజీ ఉపయోగించి అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వారి బాధను భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరించి ఏకంగా…
Telangana Police: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) గుండెపోటుతో కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. Also Read: Singer Chinmai: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై.. వైరల్ కామెంట్స్ చేసిన…
DCP Vineeth : గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో చోటు చేసుకున్న కాల్పుల ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ప్రిజం పబ్బుల్లో మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ ఉన్నాడు అని సమాచారం అందిందన్నారు. నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై కాల్పులు జరిపాడని, దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలికి బుల్లెట్ గాయం అయిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు తుపాకులు సీజ్ చేశామని, 23 రౌండ్లు బుల్లెట్స్…
Republic Day 2025 : 2025 రిపబ్లిక్ డే సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు సంబంధించిన మొత్తం 942 మంది సిబ్బందిని గ్యాలంట్రీ అవార్డులతో గౌరవించింది. వీరిలో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి గ్యాలంట్రీ పతకాలు, అలాగే 2 మందికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అందజేశారు. గ్యాలంట్రీ అవార్డుల్లో…