ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు బన్నీని అరెస్టు చేయగా బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ప్రబుత్వంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత కామెంట్స్ చేస్తూ…
SI Suicide : ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య కేసులో మహిళను అరెస్టు చేశారు పోలీసులు. వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ తన సర్వీస్ పిఠాలతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతని మరణానికి కారణమైన మహిళ బానోతు అనసూర్య అలియా అనూష అరెస్టు చేసినట్టు తెలిపారు పోలీసులు. రాంగ్ నెంబర్ ద్వారా హరీష్ పరిచయం చేసుకొని అతడిని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుందని…
Ganja Seized : మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి భారీ ఎత్తున గంజాయి తరలిస్తుండగా, పూణె , గోవా రాష్ట్రాల డిఆర్ఐ స్పెషల్ ఫోర్స్ అధికారులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా చెక్‌పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్ఐ అధికారులు…
DCP Narasimha : సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 1100మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ డీసీపీ నర్సింహా మాట్లాడుతూ.. 2023 ఏప్రిల్ 20నుండి కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ ప్రవేశపెట్టారని, ఎక్కువ ఫిర్యాదులు మొబైల్స్ చోరీ, పోగొట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాళ్లంతట వల్లే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని,…
Telanga Police: గత కొన్ని నెలలుగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. "నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి…
Telangana Police: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు, మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు TGCSB స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు.
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఏఓబీ ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి, బెంగూళూరు, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను ఎక్సైజ్, ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు ఎంతో శ్రమకు ఓర్చి పట్టుకున్నారు. 703 కేసుల్లో పట్టుబ డిన 7951 కేజీల గంజాయిని, డ్రగ్స్‌ను కాల్చేశారు. దహనం చేసిన గంజాయి, డ్రగ్స్ విలువ రూ.11,61,90,294 ఉంటుంది.