VC Sajjanar : బెట్టింగ్ యాప్‌లపై యుద్ధం.. సామాజిక మార్పు కోసం సజ్జనార్ పిలుపు
- బెట్టింగ్ యాప్స్ మాయ.. యువతను ఎలా ప్రభావితం చేస్తోంది?
- సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు ఎందుకు?
- సామాజిక మార్పు కోసం పిలుపు.. బెట్టింగ్ ముళ్లను అరికట్టాలంటే ఏమి చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమాయక యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఇటీవల ఏపీకి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని, రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌పై నమోదైన కేసుల్లో సజ్జనార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై కూడా దృష్టి సారించారు.
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
సజ్జనార్ హర్ష సాయికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు, ఇందులో హర్ష సాయి తన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లను సమర్థించుకుంటూ మాట్లాడుతూ కనిపించారు. “నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్లు చేస్తారు, కనుక ఇది తప్పు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సజ్జనార్, “తప్పే చేస్తున్నా, దాన్ని సమర్థించుకోవడం సరికాదు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా కనీస బాధ్యత లేకుండా డబ్బే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు” అంటూ ఆయన మండిపడ్డారు. ఆయన యువతను ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను అన్‌ఫాలో చేయాలని, వారి అకౌంట్లను రిపోర్ట్ చేయాలని సూచించారు. అలాగే, ఈ వీడియోను కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సైబర్ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారింది.
సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, “బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లను అరికట్టేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి. అనేక మంది ప్రాణాలను రక్షించాలి” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, సామాజిక మార్పు కోసం తమ వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. అతడి తాజా చర్యలు మరికొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా బేరీజు వేసుకునేలా చేస్తున్నాయి.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!