Musi River Project: మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం.. భూసేకరణ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musi River Rejuvenation Project: హైదరాబాద్ మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం మూసి అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు మూసి రివర్ డవలప్మెంట్ కార్పొరేషన్ (MRDCL) కీలక ప్రకటన చేసింది. ఫేజ్ A1 హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2 ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయనుంది. హైదరాబాద్, గోల్కొండ మండలం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూముల అక్విజిషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. భూమి యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తమ హక్కుల పత్రాలు (పట్టాలు, ఆధార్, బ్యాంక్ వివరాలు) సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత సమయంలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని స్పష్టం చేసింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితా ప్రకటించింది. Land Acquisition Act, 2013 నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టనుంది.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసి అభివృద్ధి పనులు చేపట్టనున్న విషయం తెలిసిందే. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55కిలోమీటర్ల పరిధిలోని 14 మండలాలు 46 గ్రామాల్లో దశల వారీగా 55 కిలో మీటర్ల మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
READ MORE: Rahul Gandhi: అవసరమైన వాటికి కేటాయింపులే లేవు.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!