Betting Apps : తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు బి.ఎన్.ఎస్ లోని 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్…
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్‌కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఈ ముఠాలో…
CP Sudheer Babu : రాచకొండ పోలీసులు చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అంతేకాకుండా, దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుసంధానంలో ముఠాలో ప్రధానంగా అమూల్య అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు…
VC Sajjanar : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమాయక యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న సోషల్…
Wine Shops : గ్రీష్మకాలం సమీపిస్తున్న వేళ మద్యం ప్రియులకు ఊహించని షాక్. ఎండల వేడి నుండి కాస్త ఉపశమనం కోసం బీర్లు, మద్యం ఆశ్రయించే మందుబాబులకు, ఈ నెల 14వ తేదీ ప్రత్యేకంగా చేదు అనుభవం కలిగించనుంది. నగర పోలీసులు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, సామాజిక అసౌకర్యాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు…
గంజాయి డాన్ అంగూరు భాయ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్పేట్ సీఐ మధుబాబు.. అంగూర్ భాయ్‌కి పీడీ జీవోను అందించారు. రాష్ట్రం కాని రాష్ట్రంలోకి వచ్చి.. తెలంగాణలోని దూల్పేట్లో స్థిరపడి.. గంజాయి డాన్‌గా ఎదిగిన అంగూర్ భాయ్‌పై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ…
జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవలే కిడ్నప్ కు గురైన 10 నెలల పసి పాప శివాని కేసును జనగామ పోలీసులు ఛేదించారు. పాపను కిడ్నప్ చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఏసీపీ పండేరి చేతన్ నితిన్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రామ్ జూల్ - పార్వతి దంపతులు జిల్లా కేంద్రంలో కూలి పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నారు..
AV Ranganath : ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఈ కేసును దర్యాప్తు చేసిన నల్గొండ జిల్లా మాజీ ఎస్పీ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది నిందితులకు కోర్టు శిక్ష విధించడంతో, తాము చేసిన దర్యాప్తుపై గర్వంగా ఉన్నామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో దర్యాప్తును అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించామని రంగనాథ్ తెలిపారు. దాదాపు ఏడు…
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.