ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఐదేళ్ల పాలన స్వార్థ రాజకీయాలకు నిదర్శనం: వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే.. ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా నాశనం చేశారని, గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని మండిపడ్డారు. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సమాజంలో…
కెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం: తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూ లైన్లోనికి అనుమతించరు. అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ…
నేడు పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సేవ్ ది గర్ల్ 2k రన్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత హాజరుకానున్నారు. ఇవాళ శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పౌర్ణమి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు. నేడు రాయచోటిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు. నేడు గుంటూరులో కేంద్ర ,రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో…
Ganja Seized : మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి భారీ ఎత్తున గంజాయి తరలిస్తుండగా, పూణె , గోవా రాష్ట్రాల డిఆర్ఐ స్పెషల్ ఫోర్స్ అధికారులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా చెక్‌పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్ఐ అధికారులు…
Ganja : సులభంగా డబ్బు డబ్బు సంపాదన కోసం ఇంటి వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే తరహాలో ఒక వ్యక్తి తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు . వివరాల్లోకి వెళ్ళితే సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో లోని శాయంపేట ప్రాంతంలో నివాసం వుంటున్న అట్ల వెంకట నర్సయ్య (72), వ్యవసాయంకూలీగా పనిచేస్తూనే మరింత సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. RG Kar Case: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో…
Telangana Olympic Association: తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి బరిలో నిలబడి విజయం సాధించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి స్థానానికి జితేందర్ రెడ్డితో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు, చాముండేశ్వర్‌నాథ్ ఉపాధ్యక్ష స్థానానికి కూడా నామినేషన్ వేశారు. అలాగే ప్రధాన కార్యదర్శికి మల్లారెడ్డి, బాబురావు, ప్రదీప్ కుమార్ నామినేషన్లు వేశారు. Also Read: Deputy…
Ande Sri on Telangana Thalli: తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ తల్లి పై పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. గత పాలకులు అన్నట్లుగా అరుస్తున్నట్లుగా తెలంగాణ తల్లి లేదని, అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రూపం నేటి తెలంగాణ తల్లి రూపం అని ఆయన వాపోయారు. బతుకమ్మ దేవత, ఆ దేవతను, మరో దేవత నెత్తిన కిరీటం పెట్టుకుంటుందా..? మానవ రూపంలో కిరీటం సరైనది కాదని తెలిపారు.…
సీల్డ్ కవర్లో డబ్బులు దండుకుంటున్న డాక్టర్లు: చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ మాఫియాతో డాక్టర్లు చేతులు కలిపారు. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రేలను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు రాసి.. సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకొంటున్నారు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ఇది ఓ వ్యసనంగా మారింది. రోగులకు వైద్యం చేయాల్సింది మరచి.. అదే రోగులతోనే మూడు పువ్వలు ఆరు కాయలుగా డాక్టర్ల…
Training For MLAs And MLCs: హైదరాబాదు నగరంలోని డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధ, గురు వారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనపరిషత్తు సభ్యులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ ప్రోగ్రాం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులు పరిశీలించారు. ఈ సందర్బంగా MCHRD స్పెషల్…