మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు." అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఎఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు భోగాపురం విమానాశ్రయానికి ఈ భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం…
HYDRA: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో శ్మశాన వాటికలపై జరిగిన అక్రమ కబ్జాలను తొలగించేందుకు అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నుంచే హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు. పర్వతాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 1, 12లో ఉన్న ముస్లిం , క్రిస్టియన్ శ్మశాన వాటికలపై కొంతకాలంగా భూకబ్జాదారులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు నిర్వహించినట్లు సమాచారం. గత రెండు ఏళ్లుగా…
కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం: కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందాం అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని మండిపడ్డారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్‌ను…
Amrit Bharat Stations: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దేశం అనేక రంగాలలో వేగవంతమైన అభివృద్ధితో ముందుకు సాగుతోంది. గతానికి భిన్నంగా అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడమే లక్ష్యంగా ఆయా రంగాలలో ప్రపంచంతో పోటీ పడుతూ సాగుతున్న అభివృద్ధి, అందుకు జరుగుతున్న కృషి దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైల్వే వ్యవస్థలో.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దూరదృష్టి కారణంగా.. గత 11 ఏళ్లలో చోటు…
జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దు: మాజీ సీఎం వైఎస్ జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దని వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్స్…
స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచ్: స్కూల్ డేస్‌లో తనది లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్కూల్లో పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని పేర్కొన్నారు. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి, సీఎం నారా చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు…
ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవు: రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా…
Terrorist Attack : దేశవ్యాప్తంగా శాంతి భద్రతలకు పతనం కలిగించేందుకు కుట్రలు నడుస్తున్న దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేలుళ్ల కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న గ్రూపును భద్రతా సంస్థలు పట్టు పట్టాయి. ఇందులో ఆరుగురు సభ్యులతో కూడిన తీవ్రవాద సంస్థ “అల్-హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్” కీలక పాత్ర పోషిస్తోంది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ జీవితం ఒక సాధారణ యువకుడి ప్రయాణంలా మొదలైంది. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి…
Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ…