Illegal Affair : మెదక్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హావేలి ఘనపూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన నరేష్ (31), సునీత (28) మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరికీ కుటుంబాలు ఉన్నప్పటికీ, వారి సంబంధం తీవ్రతరమైంది. నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, సునీతకూ భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిసిపోయింది. పెద్దలు పంచాయతీ పెట్టి వారిద్దరిని మందలించారు. దీనితో మనస్తాపానికి లోనైన సునీత, ఈ నెల 5వ తేదీన పురుగుల మందు తాగింది. ఆమెను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ జూన్ 7న మృతి చెందింది.
Top Headlines @9AM : టాప్ న్యూస్
ప్రియురాలి మృతి వార్త తెలుసుకున్న నరేష్ తీవ్ర భావోద్వేగానికి గురై లింగ్సంపల్లి అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందున పోలీసులు గ్రామంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ విషాదకర సంఘటన రెండు కుటుంబాలను దుర్భాగ్యంగా విడిపోసింది. ఒక వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలితీసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.