Murder : హైదరాబాద్ శివారులోని మణికొండలో తప్పిపోయిన వృద్ధురాలి మిస్టరీకి తెరపడింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన బాలమ్మ అనే వృద్ధురాలి అదృశ్యంపై జరిగిన విచారణ దారుణ హత్యను బయటపెట్టింది. వృద్ధురాలిపై అత్యాశ పెంచిన మరో మహిళ ప్రణాళికాబద్ధంగా హత్య చేసిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 3న వాకింగ్‌కు వెళ్లిన బాలమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కోడలు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలమ్మతో సన్నిహిత సంబంధాలు ఉన్న అనిత అనే మహిళపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దృష్టిపెట్టి నార్సింగ్ పోలీసులు అనితను ట్రేస్ చేసి ఈనెల 7న వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. తీవ్ర ఉద్రిక్తత!
అనితను విచారించగా బాలమ్మను హత్య చేసిన విషయాన్ని ఆమె ఒప్పుకుంది. బాలమ్మ ఒంటిమీద ఉన్న బంగారు, వెండి నగల కోసమే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించింది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని వికారాబాద్ జిల్లా కంద్లపల్లి అటవీ ప్రాంతంలో పడేసినట్లు తెలిపింది. అయితే, ఇప్పటికే ఆ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని జూన్ 4న చెన్‌గోముల్ పోలీసులు గుర్తించారు. స్పాట్‌లోనే పోస్టుమార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు.
అనంతరం అనిత ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహాన్ని తిరిగి వెలికితీసిన పోలీసులు, బాలమ్మ కుటుంబ సభ్యులను పిలిచి గుర్తింపు పనులు నిర్వహించారు. వారు దాన్ని బాలమ్మదిగా ధృవీకరించారు. పోలీసుల దర్యాప్తుతో వృద్ధురాలి హత్య మిస్టరీకి తెరపడింది. బాధిత కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మరొకవైపు నిందితురాలైన అనితపై చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Karthik Dandu: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ డైరెక్టర్.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్