హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
వారం రోజులైనా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగాని యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో సన్నీ బయ్యను విచారిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్ర, సన్నీలను కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Fraud : తెలంగాణలో నిరుద్యోగుల ఆశలను తమ లాభాలకు మార్గంగా మలుచుకునే మోసగాళ్ల చతురత రోజురోజుకీ పెరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్పిస్తామని, ఎయిర్ఫోర్స్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివిధ రూపాల్లో మోసాలు చేస్తున్నారు. అయితే ఈ సారి పురుషులే కాదు, ఓ మహిళ కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తాను హైకోర్టు జడ్జినని చెప్పి నిరుద్యోగుల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రసన్నా రెడ్డి అనే…
Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా మరో ఐదు కోడెలు మృతి చెందగా, గత రెండు రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.…
మాజీ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా…
తీరం దాటిన వాయుగుండం: రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ – దక్షిణ ఛత్తీస్గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40–50 కి.మీ. వేగంతో…
జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు.
Tragedy : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనం పై నుండి ప్రమాదవశాత్తు కిందపడిన మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విలిమల ప్రాంతంలో ఓ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్కు చెందిన రూప్ సింగ్ అనే మేస్త్రీ, అతని భార్య కార్మికురాలిగా అక్కడే పని చేస్తున్నారు. వారి మూడేళ్ల…
MGM : వరంగల్ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల అయిన ఎంజీఎం ఆసుపత్రిలో పెద్ద స్థాయిలో ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతుల్లేకుండా విధులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో మొత్తం 77 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఈ ఘటన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ…
టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?: తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి…