Food Poison : ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మందికి పైగా మానసిక రోగులు భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కరణ్ అనే వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతిచెందాడు. ఇతర బాధితులను ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్సకు తరలించగా, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆహారం…
VC Sajjanar : హైదరాబాద్ నగర వీధులు రాత్రివేళల్లో వేడుకల వేదికలుగా మారిపోతున్న దృశ్యాలు ఇటీవల తరచూ కనపడుతున్నాయి. ముఖ్యంగా యువత బర్త్‌డే వేడుకలను బహిరంగంగా, పబ్లిక్ రోడ్లపై నిర్వహించడం కొత్త నాయా ట్రెండ్‌గా మారింది. మితిమీరిన సందడి, మద్యం మత్తులో అప్రమత్తత లేకుండా చేసే చేష్టలతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అర్ధరాత్రి వేళ రోడ్లపై శబ్దాలతో, పాటలతో, హంగామాతో సాగుతున్న ఈ పండుగలు శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఉప్పల్‌లోని భగాయత్ రోడ్…
భూమి కబ్జా చేశారని జవాన్ సెల్ఫీ వీడియో: తన భూమి కబ్జా చేశారని మడకశిరకు చెందిన ఓ జవాన్ జమ్మూ కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మడకశిర మండలం హుదుగూరు గ్రామంలో కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా అధికారులను వేడుకున్నారు బిఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న తన భూమి గ్రామంలోని తన మామ కబ్జా చేస్తున్నాడని ఆరోపించాడు. తన భూమిలో సాగు…
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం: మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. పెద్ద బండరాయిని ఢీ కొట్టి బస్సు నిలిచిపోవడంతో 30 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ కు పెళ్లి బృందం వెళ్లి వస్తుండగా అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. చక్రాలు లోయలోకి…
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
వారం రోజులైనా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగాని యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో సన్నీ బయ్యను విచారిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్ర, సన్నీలను కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Fraud : తెలంగాణలో నిరుద్యోగుల ఆశలను తమ లాభాలకు మార్గంగా మలుచుకునే మోసగాళ్ల చతురత రోజురోజుకీ పెరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్పిస్తామని, ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివిధ రూపాల్లో మోసాలు చేస్తున్నారు. అయితే ఈ సారి పురుషులే కాదు, ఓ మహిళ కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తాను హైకోర్టు జడ్జినని చెప్పి నిరుద్యోగుల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రసన్నా రెడ్డి అనే…
Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా మరో ఐదు కోడెలు మృతి చెందగా, గత రెండు రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.…
మాజీ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా…
తీరం దాటిన వాయుగుండం: రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ – దక్షిణ ఛత్తీస్‌గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40–50 కి.మీ. వేగంతో…