సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలలో గంజాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. మంగ్లీ పోలీసుల మీద విరుచుకుపడుతున్నట్టుగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంగ్లీ ఫోటో వాడుతూ ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగ్లీ ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. అందరికీ నమస్కారం, నిన్న ఏదైతే నా బర్త్ డే పార్టీ జరిగిందో, ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలని ఒక ఉద్దేశంతో మా ఫ్యామిలీ వాళ్ళ కోరిక మేరకు ఒక రిసార్ట్లో మా అమ్మానాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది.
Also Read:Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!
అక్కడ మా అమ్మానాన్నలు, నా ఫ్రెండ్స్ మా అమ్మానాన్నల ఫ్రెండ్స్ , మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే పాల్గొనడం జరిగింది. మా పార్టీలో లిక్కర్ ఉంది సౌండ్ సిస్టం ఉంది. అయితే ఇలా పార్టీలో సౌండ్ సిస్టంకి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని ఐడియా నాకు లేదు. ఎందుకంటే అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్లిపోవడం జరిగింది. పర్మిషన్ తీసుకోవాలని తెలిసి ఉంటే నేను ముందే పర్మిషన్ తీసుకుని ఉండేదాన్ని. నేను మా పార్టీలో ఎలాంటి తప్పు చేయలేదు. పార్టీ గురించి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని నాకు ఎవరూ చెప్పలేదు. ఎవరైనా చెప్పి ఉంటే నేను పోలీస్ పర్మిషన్ తీసుకునే దాన్ని. వీడియోలో చూపిస్తున్నట్లు పార్టీలో ఎక్కడా విదేశీ మద్యం దొరకలేదు. పార్టీలో ప్యూర్ గా లోకల్ లిక్కర్ మాత్రమే ఉంది అదే పోలీసులకు దొరికింది. అలాగే మా పార్టీలో గంజాయి తీసుకున్న వ్యక్తి కూడా దాన్ని ఎక్కడో తీసుకుని పార్టీకి రావడం జరిగింది. నా పార్టీలో ఎవరూ గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకోలేదు. నేను ఈ పార్టీని నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ టీమ్ మెంబర్స్ తో చేసుకున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నేను తప్పు ఎలా చేస్తాను అంటూ ఆమె ఒక వీడియో విడుదల చేసింది