ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అనిల్ కుమార్, హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఐపీఎస్ జితేంద్ర పని చేశారు. జితేందర్, అనిల్ కుమార్ దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఈ ఇద్దరూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రివ్యూ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు. 2023 నవంబర్ మాసంలో 600 సెల్ ఫోన్ నంబర్స్ లోని రివ్యూ కమిటీకి ఇచ్చారు ప్రభాకర్. సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టుల పేరుతో ఫోన్లను టాప్ చేశారు. అధికార, ప్రతిపక్ష వ్యాపారవేత్తలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫోన్‌లను టాప్ చేశారు.
READ MORE: Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..