చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుని హత్య కలకలం సృష్టించింది. చందానగర్ లోని గిడ్డంగి కల్లు కంపౌడ్ లో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నలుగురు మిత్రులు కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగడానికి వచ్చారు. అమ్రేష్ అనే యువకుడిని అతని ముగ్గురు స్నేహితులు కలిసి చంపేశారు. ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగింది.
అమ్రేష్‌తో గొడవలో ఉన్న ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో అమ్రేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గత కొంతకాలంగా నలుగురి మధ్య ఈ అమ్మాయి విషయంలో వివాదం నడుస్తోందని, ఇది చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. స్నేహితుల మధ్య విభేదాలు ఇంతటి దుర్మార్గానికి దారితీయడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేపట్టారు.
READ MORE: Phone Tapping Case: మావోయిస్టులను పేరు వాడుకుని.. బడా నేతల ఫోన్లు ట్యాప్..!