కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా యూనివర్శిటీలో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు. బాయ్స్ హాస్టల్ సమీపం నుంచి ఎంబీఏ కాలేజీ ఆవరణం వరకూ విస్తరించాయి మంటలు. శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న…
నిన్నమొన్నటివరకూ చలికాలం చంపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పులి పంజా విసిరింది. చలికాలం విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ సూరీడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. శివరాత్రి ముగిసిన వెంటనే చలి తగ్గుతుంది కానీ మరీ ఇంత వేడి వుండడం అరుదు అంటున్నారు జనం. వేసవికాలం వచ్చేసిందనడానికి దండి కొడుతున్న ఎండలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో గురువారం అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల…
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇది 40లక్షల కుటుంబాల సమస్య. తెలంగాణ లో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. 90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39లక్షల మంది నోట్లో మట్టి కొడుతున్నారు. నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలి…అఖిలపక్షంతో చర్చించాలన్నారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు…
National Students Union Of India (NSUI) Protest at Front on TSPSC Office. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ‘ఛలో టీఎస్పీఎస్సీ’కి పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్యూఐ పిలుపు మేరకు విద్యార్థులు టీఎస్పీఎస్సీ భవనం సమీపంలోని గాంధీ భవన్లో గుమిగూడారు. అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.…
Professor Kodandaram Made Comments On TRS Government. మెదక్లోని టీఎన్జీవో భవన్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపారని ఆయన ఆరోపించారు. మల్లన్న సాగర్ రైతులు న్యాయం చేయమని అడిగినందుకు ఆ గ్రామాల్లో 144…
ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు షర్మిల. పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే 22వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుని… స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చాడన్నారు. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు…
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు.బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు మంత్రులు. ఉదయం 9 గంటలకు బాసరలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 9.20 గంటలకు ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు మంత్రులు. 12.15 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో…
రాజకీయ లబ్ధికే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యం అన్నారు గుత్తా. రష్యా- ఉక్రెయిన్ ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం. కాంగ్రెస్ పార్టీ…