దేశంలో రాజకీయాలను మార్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందులో భాగంగా కేసీఆర్ ఆదివారం ముంబై బయలుదేరి వెళ్ళారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్పవార్లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాలిటెక్నిక్ పేపర్ లీకేజీ ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు రెండవ నిందితుడు స్వాతి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పరారీలో మొదటి నిందితుడు, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వున్నారు. అలాగే, మూడవ నిందితుడు లెక్చరర్ కృష్ణమోహన్ కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు వీరు దొరికితేనే కీలక విషయాలు…
తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టడంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పుపట్టడం సిగ్గు చేటు. ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? పార్లమెంట్ తలుపులు మూసి, మైకులు బంద్ చేసి కనీస చర్చల్లేకుండా తెలంగాణ బిల్లు పెట్టిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే…
ఖమ్మం జిల్లాగా పాలేరు నియోజకవర్గాన్ని చూశానన్నారు టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. కులమతాలకు, పార్టీల అతీతంగా అభివృద్ధికి కృషి చేశానన్నారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మీ ఆశీస్సులతో బై ఎలక్షన్ లో గెలుపొంది మీ నియోజకవర్గం లోని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశా అన్నారు తుమ్మల. ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలను అభివృద్ధి చేశానన్నారు. నలభై సంవత్సరాలుగా…
తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలో త్వరలోనే జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటుచేస్తామని, దీనిపై హైకోర్ట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.…
తెలంగాణలో దళితుల సమగ్ర ప్రగతికి సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్గిపేట జిల్లానారాయణ రావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో దళిత బంధు అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు పాల్గొన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు హరీష్ రావు. దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలతో స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి మీ కాళ్లపై మీరు నిలబడాలన్నారు.…
సంగారెడ్డి జిల్లా వెలిమెలకు చెందిన రియల్టర్ హత్య కేసుని చేధించారు పోలీసులు. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపింది. కనిపించకుండా పోయిన రియల్టర్ కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. హత్యకేసులో మృతుని సోదరుడు రాంసింగ్ నాయక్తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి.. వెలిమెల కడవత్ రాజు నాయక్ ను హత్య చేసి ఒక చోట తల, మరో చోట…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది చింతపల్లి నరబలి కేసు. నల్గొండ జిల్లా చింతపల్లిలో జరిగిన ఈ ఘోరంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 10 రోజులు అవుతున్నా నిందితులు ఇంకా దొరకలేదు. ఎవరు హత్య చేశారు? లేకపోతే నరబలి ఇచ్చారా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు కష్టంగా మారింది కేసు. తెలిసిన వ్యక్తులతో పాటు అనుమానంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కొద్దిరోజుల క్రితం చింతపల్లి మహంకాళి విగ్రహం…