తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లి మిస్ అయిన మహిళ ఆచూకీ లభించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారు శిరీష గత రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో వెళ్లింది. అయితే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ కెమెరా తో గాలింపు చేపట్టారు. ఈరోజు ఉదయం భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి శివారు అడవి ప్రాంతంలో పోలీసులు ఆమెను గుర్తించారు. నీరసంగా ఉండడంతో భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
శిరీష ఆచూకీ కోసం భూపాలపల్లి ములుగు జిల్లా అధికారులు 8 బృందాలుగా ఏర్పడి భూపాలపల్లి.. ములుగు జిల్లాలోని అడవిలో డ్రోన్స్ సహకారంతో గాలించారు. శిరీష గురువారం ఉదయం తునికాకు సేకరణకు కోసం కొందరు మహిళలతో కలిసి సమీప అడవిలోకి వెళ్ళింది. తునికకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన ఇతర మహిళలు తిరిగి వచ్చిన శిరీష మాత్రం రాలేదు. దీంతో శిరీష అడవిలో తప్పిపోయినట్లు ఆమె భర్త రాఘవులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా కు సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్.. ములుగు,భూపాలపల్లి జిల్లా ఫారెస్ట్,పోలీస్,రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. శిరీష ఆచూకీ దొరికే వరకు గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఫారెస్ట్,రెవెన్యూ,పోలీసు అధికారులు 24 గంటలుగా శ్రమించిన అనంతరం మహిళ ఆచూకీ లభించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Palugula Bridge: ఐదేళ్ళయినా అడుగైనా పడని పలుగుల వంతెన