ఈమధ్య కాలంలో వన్యప్రాణులు, పాములు, ఏనుగులు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. కార్లు, స్కూటర్లు, ఇళ్ళల్లోకి పామలు, ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. గంట పాటు అటవీశాఖ సిబ్బందిని పాము తిప్పలు పెట్టింది. రెస్క్యూ ఆపరేషన్ చేశాక కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.
మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఒక్కసారిగా విశేష అతిథి సందడి చేసింది. ఉదయం కార్యాలయం తెరిచేసరికి ఓ పాము హల్చల్ చేసింది. కలెక్టర్ సి ఛాంబర్ లో పాము బుసలు కొడుతున్న శబ్ధం రావడంతో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది చూసి ఉలిక్కి పడ్డారు. వెంటనే ఆటవీ శాఖ ఆధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆటవీ శాఖ ఆధికారులు కలెక్టరేట్ కి చేరుకున్నారు. పాములు పట్టే షేక్ ఇమాం సహాయంతో కలెక్టర్ సి సి ఛాంబర్ లో వున్న పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వేగంగా పతనమవుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ! మోగుతున్న ధరల మోత, సామాన్యుడు బతికేదెలా?