ఉపాధి కూలీలు రోడ్డెక్కారు. పనులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఎంత కష్టపడిన రోజుకూలీకి మాత్రం సరైన ధర ఇవ్వడంలేంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాళం కష్టపడిన పై యజమానులిచ్చే కూలీ సరిపోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడితే వారికి వచ్చే రూ.30 మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. కనీస ధర కూడా ఇవ్వకుండా మా శ్రమను యజమాను దోచుకుంటున్నారని మండి పడ్డారు. ఈఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండల కేంద్రంలోని పెద్దమ్మ కుంట వద్ద జరుగుతున్న ఉపాధి పనులు బహిష్కరించి కూలీలు ధర్నా చేపట్టారు. గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నా రోజుకు కనీసం రూ.30 నుండి 70 రూపాయల లోపు ఆదాయం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపైసలతో కుటుంబాన్ని పోషించుకునలేక పోతున్నామని అన్నారు. ఇప్పుడు నిత్యావసర సరకుల ధరలు ఆకాశానంటాయని వాటిని కొనడానికి రూ.30 సరిపోతాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడినా పై యజమానులు ఇచ్చే ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదని ఆవదేన వ్యక్తం చేశారు. ఈ కొద్ది ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని వాపోయారు.
పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, నిత్యావసర సరుకులు కొనాలన్నా చాలా కష్టంగా మారిందని వారికడుకోతును వెలిబుచ్చుకున్నారు. రోజంతా కుటుంబానికి దూరంగా వుంటూ ఎంత పనిచేసిన సరైన కూలీ రావండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత శాఖ అధికారులు ఫీల్డ్ మీదికి రావడం లేదని ఆందోళన చేపట్టారు. కూలీలకు కనీస వసతులు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు పనిచేసే చోట ఏర్పాటు చేయడం లేదని కూలీలు వాపోయారు. కనీస సౌకర్యాలపై పట్టించుకునే నాథుడే కరువయ్యారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఉపాధి కూలీలు పనులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ములుగు పరకాల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.సంబంధిత శాఖ అధికారులు ఫీల్డ్ మీదికి రాకపోవడంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోజువారి ఆదాయం పెంచాలని కోరారు. రోజువారిపనికి సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.