Hyderabad : కమాండ్ కంట్రోల్ తెలంగాణ రాష్ట్రానికే ఐకానిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 580 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, పలువురు అధికారులతో కలిసి సందర్శించారు. భవనంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ సీఈ గణపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు మంచి పనితీరును కనబరుస్తున్నారని ప్రశంసించారు. పోలీసు పనితీరుతో దేశవిదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మరో మూడునెలల్లో కమాండ్ కంట్రోల్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. మొత్తం రూ.580 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.450కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. దేశంలో ఏ నగరంలో ఇలాంటి కమాండ్ కంట్రోల్ భవనం లేదని, యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఇలాంటి సెంటర్లు ఉన్నాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ కమాండ్ కంట్రోల్ తెలంగాణ రాష్ర్టానికే ఐకానిక్‌గా మారుతుందన్నారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..